Maharashtra Elections Result 2024 : ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. శల్య సారథ్యం అనే నానుడిని నేటి కాలంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నిజం చేసి చూపించారు కాబట్టి.. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ… ఇది నూటికి నూరుపాళ్లు నిజం.. జర్నలిస్టుగా సంజయ్ తన కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత బాల్ ఠాక్రే కు దగ్గరయ్యాడు. ఆ సమయంలో శివసేన లో మంచి స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఎంపీగా ఎన్నికయ్యాడు. కానీ తన జర్నలిస్టు తెలివితేటలతో ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయలేకపోయాడు. తాను భ్రష్టపట్టడమే కాకుండా.. శివసేనను కూడా సంకనాకించాడు. ఉద్ధవ్ సతీమణి రష్మీ ఠాక్రే కు దగ్గరయ్యాడు (తప్పుగా అనుకోవద్దు).. ఆమెకు లేనిపోనివి చెప్పి.. ఉద్ధవ్ ను ఆ తీరుగా నడిపించాడు. అయితే అవి విజయవంతం కాకపోగా.. దారుణంగా విఫలమయ్యాయి. శివసేనకే దెబ్బకొట్టాయి. దీంతో అవి షిండేకు లాభం చేకూర్చాయి. పదేపదే ఎన్నికల్లో షిండేను ఆటో డ్రైవర్ కొడుకు అని మాట్లాడించడం.. అతడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేయించడంతో మహారాష్ట్ర ఓటర్లు మహా యుతి కూటమికి పట్టం కట్టారు. దీంతో దేవేంద్ర పడ్నవిస్ ముఖ్యమంత్రి కావడం లాంచనమైపోయింది. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఎన్నిక కూడా నిర్ణయం అయిపోయింది. ఇక ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షిండే కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని తెలుస్తోంది.
ఈవీఎంలను ఒప్పుకోరట
మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సంజయ్ తన తీరు మార్చుకోవడం లేదు. పైగా ఈవీఎంలది తప్పు అని వ్యాఖ్యానిస్తున్నారు. వాటిని ఎన్డీఏ కూటమి టెంపరింగ్ చేసిందని మండిపడుతున్నారు. ” షిండే పరిపాలన బాగోలేదు. అజిత్ పవర్ పై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మాకే వచ్చాయి. అలాంటప్పుడు ఫలితాలు ఎలా మారుతాయి” అని సంజయ్ రౌత్ ఆరోపించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ తమ ఇండియా కూటమిలో ఎన్ని మరకలు ఉన్నా ప్రజలు పట్టించుకోవద్దట.. ఏకపక్షంగా ఓట్లు వేయాలట.. పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే ఎక్కువ సీట్లలో గెలిపించి మహారాష్ట్ర అసెంబ్లీకి పంపించాలట.. మహారాష్ట్ర ప్రజలకు అంతకుమించిన దిక్కు లేదట.. అన్నట్టుగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై బీజేపీ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు..” ముందు మీరు వక్రబుద్ధిని మార్చుకోండి. ప్రజల గురించి ఆలోచించండి. ప్రజలు ఇచ్చిన తీర్పు గురించి పరిశీలించండి. ఎలా చేస్తే ప్రజల మన్ననలు పొందుతారో తెలుసుకోండి. అంతేతప్ప చవకబారు విమర్శలు చేసి పరువు తీసుకోకండి అంటూ” బిజెపి నాయకులు హితవు పలుకుతున్నారు. అయితే సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ శివసేన నుంచే విమర్శలు వ్యక్తం కావడం విశేషం.