https://oktelugu.com/

Jharkhand Election Result 2024 : జార్ఖండ్ పుట్టుక ఘనత కమలం పార్టీ దే.. ఐనా సరే మోడీషా కు దక్కలేదు..

హేమంత్ సోరెన్ బొచ్చెడు దోచుకున్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి. అరెస్టు కూడా చేశాయి. మోడీషా వాలిపోయారు. చేయాల్సింది మొత్తం చేశారు. అయినప్పటికీ జార్ఖండ్ దక్కలేదు. స్థూలంగా చెప్పాలంటే 2019 నాటి పరిస్థితే.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 4:27 pm
    Jharkhand Election Result 2024

    Jharkhand Election Result 2024

    Follow us on

    Jharkhand Election Result 2024 :  మహారాష్ట్రలో బిజెపికి తిరుగులేదు. అని అదే జార్ఖండ్లో మాత్రం అంత సీన్ లేదు. అలాగాని బిజెపికి శక్తి లేదా.. యుక్తి లేదా.. అంటే అన్నీ ఉన్నా…ఏదో శని అన్నట్టుగా అక్కడ బిజెపి పరిస్థితి ఉంది. హేమంత్ మీద బిజెపి ఆరోపణలు చేసి జైలుకు పంపించింది. కానీ ఆ హేమంత్ శిబిరంలోని కొంతమందిని తమ క్యాంపులోకి లాగింది. ఇక్కడ వాషింగ్ పౌడర్ నిర్మా థియరీని అమలు చేసింది. కానీ జనాలకు ఇవి నచ్చలేదు. ఎన్నికల ముందు అరెస్టు చేయడంతో హేమంత్ మీద ప్రజల్లో సానుభూతి పెరిగింది. పైగా బీజేపీ తమను వేధిస్తోందని హేమంత్ భార్య తెరపైకి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంది. తన మాంగల్యాన్ని కాపాడాలని ప్రజలను కోరింది. ప్రజలకు మిగతావన్నీ పట్టలేదు. అవినీతి అనేది లెక్కలోకి రాలేదు. అక్రమం అనేది పట్టింపు కాలేదు.. “అవినీతి, అక్రమాలు ఎవరు చేయడం లేదు” అభిప్రాయానికి వారు వచ్చారు. అందుకే అవినీతిపరుడైనా హేమంత్ కు జై కొట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసులు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. మావాడు అనుకుని.. హేమంత్ ను గెలిపించారు.. బిజెపికి జార్ఖండ్ ను దక్కకుండా చేశారు. పైగా ఈ డి, ఐటి, సిబిఐ వంటి వాటిని ముందుగానే బిజెపి ప్రవేశపెడితే ఫలితం మరో విధంగా ఉండేది. ఎన్నికల ముందు వీటిని ప్రయోగించేసరికి హేమంత్ ఒక్కసారిగా బాధితుడయ్యాడు. ప్రజల నుంచి సానుభూతి పొందగలిగాడు.

    మోడీ షా ఫెయిల్

    ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రవేశపెడితే బొక్క పడుతుందని కేంద్ర పెద్దలు అంచనా వేయలేకపోయారు. అంతటి అనుభవం ఉన్న మోడీ షా కూడా గ్రహించలేకపోయారు. స్థూలంగా చూస్తే జార్ఖండ్లో బిజెపి వ్యూహం బొక్క బోర్లా పడ్డది. దీనినే రాజకీయ పరిభాషలో స్ట్రాటజీ ఫెయిల్ అంటారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు అధికారాన్ని దక్కించుకోలేక కిందా మీదా పడాల్సి వస్తోంది. ఇక ఇదే తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. అధికారాన్ని దక్కించుకోవడానికి 10 సంవత్సరాలు పాటు ఎదురుచూసింది. ఇప్పుడు అధికారంలో ఉంది. అలాగని అది కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ కాదు.. జస్ట్ కేసీఆర్ మీద ప్రజల్లో వ్యక్తమైన విపరీతమైన వ్యతిరేకత మాత్రమే.. మొత్తంగా ఝార్ఖండ్ ఫలితం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద ఈ దేశ ప్రజలకు గొప్ప గొప్ప అంచనాలు లేవు. ఇందిరా, నెహ్రూ, రాజీవ్ పేర్లు వల్లె వేసినంత మాత్రాన ఓట్లు రాలే రోజులు కావు. ఇక బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. సిపిఎం అంతకన్నా లేదు. నేటికీ అక్కడ మమత పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బిజెపి మాత్రమే. ఇప్పటికే ఒడిశాలో బిజెపి పాగావేసింది. ఏపీలో సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ అక్కడ అధికారం ఎన్డీఏది మాత్రమే. ఈశాన్యంలో ఆల్రెడీ ఎన్డీఏ పరిపాలన సాగిస్తూనే ఉంది. మోహన్ భగవత్ లాంటి ఓ క్యారెక్టర్ అప్పుడప్పుడు అడ్డుపడుతోంది గాని.. దేశం మొత్తం మీద చూస్తే కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కాస్త పక్కన పెడితే మిగతా ప్రాంతాలలో బిజెపి ప్రథమం లేదా ద్వితీయ స్థానంలో ఉంది.

    జార్ఖండ్ మాదిరిగానే తెలంగాణలోనూ చేస్తే

    జార్ఖండ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కేటీఆర్ గనుక అరెస్టు అయితే.. కెసిఆర్ ను గనక చక్రబంధం చేస్తే.. హరీష్ రావును పక్కనపెడితే.. రేవంత్ కు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే సన్నివేశం ఉందా.. కొంచెం టిపికల్ క్వశ్చనే .. ఆల్రెడీ జార్ఖండ్ ఫలితం కళ్ళ ముందు కనిపిస్తోంది. అలాంటప్పుడు బిజెపి ఏం చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని రేవంతుడు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయిలో చర్చ జరుగుతుందనుకోవడానికి లేదు. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత…

    Tags