https://oktelugu.com/

Devara : మూడు విదేశీ భాషల్లో ‘దేవర’..#RRR నే మించిపోయేలా ఉందిగా..ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ మామూలుది కాదు!

ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం మేనియా ఇంకా తగ్గలేదు. థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించి సుమారుగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ లో విడుదల అయ్యాక ఇంకా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 04:03 PM IST

    'Devara' in three foreign languages..#RRR seems to surpass it..NTR's global craze is not normal!

    Follow us on

    Devara : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మేనియా ఇంకా తగ్గలేదు. థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించి సుమారుగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ లో విడుదల అయ్యాక ఇంకా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఎన్టీఆర్ కి #RRR చిత్రం తర్వాత గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ఉండడంతో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం నేటి ఫ్లిక్స్ లో ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఈ సినిమాకి వారానికి 2 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయట. ఈ ఏడాది విడుదలైన అన్ని చిత్రాలలో దేవరకే అత్యధిక వ్యూస్ వచ్చినట్టు నెట్ ఫ్లిక్స్ అందించిన డేటా ని చూస్తే అర్థం అవుతుంది. అయితే రోజురోజుకి దేవర చిత్రానికి పెరుగుతున్న డిమాండ్ ని గమనించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మూడు ఫారిన్ బాషలలో డబ్ చేసి, దానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ ని రీసెంట్ గానే జత చేసింది.

    నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా మీద క్లిక్ చేసి, వివరాల్లో ఆడియో లాంగ్వేజ్ ని క్లిక్ చేస్తే బ్రెజిలియన్ పోర్చుగీస్, కొరియన్, స్పానిష్ భాషలు అందుబాటులో ఉంటాయి. ఎన్టీఆర్ కి జపాన్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో , ఈ చిత్రాన్ని జపాన్ భాషలో కూడా డబ్ చేసి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఆడియో ఫైల్ ని అప్లోడ్ చేయనున్నారు. దీంతో ఈ చిత్రానికి కూడా #RRR తరహాలో రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నారు. #RRR చిత్రం ఏడాది వరకు నాన్ స్టాప్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యింది. ‘దేవర’ చిత్రం కూడా ఆ రేంజ్ లో ట్రెండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అయితే మాత్రం ఎన్టీఆర్ తదుపరి చిత్రాలు విదేశీ భాషల్లో కూడా డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేయొచ్చు.

    ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఆగస్టు 15 న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ దర్శకుడు సౌరబ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ‘దేవర 2 ‘ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. స్టోరీ అయితే సిద్దంగానే ఉంది కానీ, ఎన్టీఆర్ ఇప్పట్లో ఈ చిత్రం చేయడం లేదట. న్యూ ఇయర్ లోపు ఈ సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.