https://oktelugu.com/

New regulations from October 1: అక్టోబర్ 1 నుంచి అన్నీ మారుతున్నాయ్.. తెలుసుకోకుంటే.. నష్టపోవాల్సిందే..

‘ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడొక లెక్క’ డైలాగ్ గుర్తుంది కదా.. అలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి చాలా నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకుల నుంచి పథకాల వరకు గతంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 30, 2024 / 07:12 PM IST

    New regulations from October 1

    Follow us on

    New regulations from October 1: దేశంలో అక్టోబర్ 1, 2024 నుంచి ఆధార్‌, పాన్‌ కార్డుతో పాటు ఆదాయపన్ను చెల్లింపు (ఐటీ రిటర్న్స్) నిబంధనల్లో మార్పులు రానున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రేపటి (అక్టోబర్ 1-మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు చాలా మందిని ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల ఈ రూల్స్‌ను తెలుసుకోవడం అతి ముఖ్యం. బ్యాంకులు, సుకన్య సమృద్ధి యోజన సహా ట్రాయ్‌ నిబంధనలు కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఐటీఆర్‌ సమర్పించడంతో పాటు పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు గతంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ సమర్పించినా అనుమతి ఇచ్చేవారు. ఇందులో ఒక మార్పు తెచ్చారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఐటీఆర్‌, పాన్‌ కార్డు దరఖాస్తుదారులు తప్పకుండా ఆధార్‌ వివరాలు సమర్పించాలి. ఆడ పిల్లల కోసం కేంద్రం తెచ్చిన పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’లో కూడా కీలక మార్పులు జరగనున్నాయి. ఈ పథకంలో కేవలం చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఖాతాలను నిర్వహించేందుకు అనుమతించారు. బయటి వ్యక్తులు బాలికల పేరుతో ఖాతాలు తెరిచి ఉన్నట్లయితే అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆ ఖాతాలను బాలికల తల్లిదండ్రులు లేదంటే చట్టపరమైన సంరక్షకులకు బదిలీ చేయాలి. లేకపోతే ఆ ఖాతాలు డియాక్టివేట్‌ అవుతాయి.

    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB)లో ఒరియంటల్‌ బ్యాంక్ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా విలీనం అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా బ్యాంకులు జరీ చేసిన వేర్వేరు చెక్‌ బుక్కులను అనుమతించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పంజాన్‌ నేషనల్‌ బ్యాంకు పేరుతో ఉన్న చెక్‌బుక్కులను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు డిమాండ్‌ డ్రాప్ట్‌, మినిమం బ్యాలెన్స్‌, చెక్కులపై ఛార్జీలు విధించనున్నారు.

    హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు లాయల్టీ ప్రొగ్రాంలో కూడా మార్పులు చేసింది. ఇవి రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్మార్ట్ బై ప్లాట్‌ఫాంలో యాపిల్‌ ఉత్పత్తుల రివార్డ్‌ పాయింట్ల రిడీమ్‌ క్యాలెండర్‌ ట్రైమాసికంలో ఒక ఉత్పత్తికి మాత్రమే పరిమితం చేసింది.

    అక్టోబర్ 1 నుంచి ట్రాయ్‌ మార్పులు చేయనుంది. 4G, 5G సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. దీంతో పాటు నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు కూడా భారీగా జరిమానా విధించనుంది. ఎస్ఎంఎస్ ల ద్వారా యూఆర్ఎల్, ఏపీకే ఫైల్స్‌ను యూజర్లకు పంపద్దు. దీంతోపాటు టెలికాం సంస్థలు నెట్‌వర్క్ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

    అంటే మీ ప్రాంతంలో 5G ఉందో, లేదో తెలుసుకొనేందుకు ఆ సంస్థల వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకు టెలికాం సంస్థల వెబ్‌సైట్‌లో లోకేషన్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా వివరాలు తెలుస్తాయి. దీంతోపాటు స్పామ్ కాల్స్‌ నియంత్రించాలని సూచించింది.