Junior NTR : పొలిటికల్ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశంలో మూడో తరం నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో ప్రవేశం పై సంచలన కామెంట్స్ చేశారు.

Written By: Dharma, Updated On : September 30, 2024 7:06 pm

Junior NTR

Follow us on

Junior NTR : రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన చుట్టూ రాజకీయ ప్రచారం మాత్రం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు తారక్. రాజకీయాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. రాజకీయ వేదికలు కూడా పంచుకోవడం లేదు. పూర్తిగా సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టారు. గతంలో అడపాదడపా అయినా రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పని చేయడం లేదు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియా స్థాయి సినిమా దేవర వసూళ్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీలో విపరీతమైన ప్రభావం చూపుతోంది. భారీగా వసూళ్లు రాబెడుతోంది. మూడు రోజులకు ఈ సినిమా 304 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరుసగా దసరా సెలవులు ఉండడంతో వస్తువులపై భారీ అంచనాలు పెట్టుకోండి ఈ చిత్ర యూనిట్. ప్రస్తుతం హిందీలో దేవరకు సంబంధించిన ప్రమోషన్లలో భారత్ బిజీగా ఉన్నారు.

* నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ
దేవర సినిమా ప్రమోషన్ లో భాగంగా నేషనల్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు తారక్.ప్రముఖ జర్నలిస్ట్ కపిల్ శర్మ తారక్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఏపీకి సంబంధించిన ఒక రాజకీయ ప్రశ్న ఎదురయింది. మీ కుటుంబంలో నటులతో పాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. మీకు సినిమాలంటే ఇష్టమా? రాజకీయాలు అంటే ఇష్టమా? రెండో కెరీర్ ఉందా? అని అడిగేసరికి తారక్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను మొదటి సినిమా చేసే సమయానికి 17 సంవత్సరాల వయసు అని.. మొదటి సినిమాకి నటుడిని అవుదామని అనుకున్నానని.. తాను ఇప్పుడు రెండో ఆప్షన్ గురించి ఆలోచించలేదని చెప్పారు. అప్పటినుంచి తాను నటనపై దృష్టి పెట్టానని తారక్ బదులిచ్చారు.

* అభిమానులు ఓటర్లుగా మారరు
మీ అభిమానులు ఓటర్లుగా మారుతారా? అనే ప్రశ్నకు సైతం… తనదైన శైలిలో చమత్కరించారు. అభిమానులు సినిమా చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసి వస్తారని.. వారు ఓటర్లుగా రారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు తారక్. తనకోసం లక్షల మంది టికెట్లు కొంటున్నారని.. అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతమందిని కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తారక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన స్టేట్మెంట్ చెబుతోంది.