టీకాల వేసు కార్యక్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 ఏళ్ల వయసు గల వారికి ఎలాంటి ముందస్తు నమోదు లేకున్నా కొవిడ్ కేంద్రాల వద్ద ఆన్ సైట్ లేదా వాక్ ఇన్ రిజిస్ర్టేషన్ చేసుకుని టీకా వేయించుకునేందుకు వీలు కల్పించింది. టీకా వృథాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీకాల కోసం ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు ఒకవేళ ఆ రోజున రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. అందుకే టీకా వృథాను కొంతలో కొంత తగ్గించేందుకు ప్రభుత్వం కొవిడ్ కేంద్రాల వద్ద 18-44 ఏళ్ల వారికి ఆన్ సైట్ అవకాశం కల్పించాలని తెలిపింది.
రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు టీకా పంపణీ వ్యవహరంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.18-44 ఏళ్ల వారికి ఆయా రాష్ర్టాల ఆన్ సైట్ రిజస్ర్టేషన్ కు అనుమతి ఇస్తే అది కేవలం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ప్రైవేటు కేంద్రాల వద్ద వాక్ ఇన్ నమోదులను చేపట్టవద్దని తెలిసింది. ఆన్ సైట్ రిజిస్టేషన్ సమయంలో టీకా కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలి.
మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తె లిసిందే.18-44 ఏళ్ల వారు కచ్చితంగా కొవిడ్ లేదా ఆరోగ్య సేతు యాప్ లో ముందస్తుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఈ నిబంధన కాస్త సడలిస్తూ ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వీరు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వొచ్చని కేంద్రం చెప్పినప్పటికి అనేక రాష్ర్టాలు వ్యాక్సిన్ల కొరత కారణంగా వీరికి టీకా పంపిణీ ఇంకా ప్రారంభించకపోవడం తెలిసిందే.
టీకా పంపిణీకి కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ర్టాలు వేసేందుకు ముందుకు రావాల్సి ఉంది. కరోనా సె కండ్ వేవ్ విస్తరిస్తున్న తరుణంలో మూడో వేవ్ రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం గుర్తించి మసలు కోవాలి. పౌరులకు విధిగా టీకాల డోసులు వేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.