https://oktelugu.com/

ఖండాంతరాలు దాటిన చిరంజీవి ‘బ్లడ్ బ్రదర్స్’

చిరంజీవి.. మెగాస్టార్ గా వెండితెరను ఏలిన ఈ హీరో.. తెరపైనే కాదు.. తెర బయటా కూడా సమాజసేవలో నేను సైతం అని ముందున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులు ఎంతో ఫేమస్. ఆయన ఈ కరోనా కల్లోలం వేళ మరణించిన ఎంతో మంది సినీ కళాకారులు, జర్నలిస్టులు, పేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఆక్సిజన్, మందులు, చికిత్సలను కూడా రోగులకు కల్పించారు. ఇక ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజల కోసం జిల్లాలో ‘ఆక్సిజన్ బ్యాంకులు’ పెట్టి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2021 / 08:34 PM IST
    Follow us on

    చిరంజీవి.. మెగాస్టార్ గా వెండితెరను ఏలిన ఈ హీరో.. తెరపైనే కాదు.. తెర బయటా కూడా సమాజసేవలో నేను సైతం అని ముందున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులు ఎంతో ఫేమస్. ఆయన ఈ కరోనా కల్లోలం వేళ మరణించిన ఎంతో మంది సినీ కళాకారులు, జర్నలిస్టులు, పేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఆక్సిజన్, మందులు, చికిత్సలను కూడా రోగులకు కల్పించారు. ఇక ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజల కోసం జిల్లాలో ‘ఆక్సిజన్ బ్యాంకులు’ పెట్టి గొప్ప సేవానిరతను చాటుకున్నారు చిరంజీవి.

    ఇక తన సేవలను తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. ఖండాంతరాలు దాటిస్తున్నారు. తాజాగా చిరంజీవి అభిమానులు యూరప్ లోనూ సేవ చేస్తుండడాన్ని చూసి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. యూరప్ లో ఉన్న నా బ్లడ్ బ్రదర్స్ కి అభినందనలు అంటూ కొనియాడారు.

    చిరంజీవి ఒక వీడియోలో మాట్లాడారు. ‘‘ఆపదలో ఉన్న కరోనా బాధితులను ఆదుకోవడానికి నేను మొదలుపెట్టిన ఆక్సిజన్ బ్యాంక్ సేవా కార్యక్రమాలలో నా అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అన్ని విధాలా స్పందిస్తున్నారు. ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్నారు. ఉచ్ఛాహాన్ని అందిస్తున్నారు.

    నేను ఇచ్చిన పిలుపునందుకుని ‘యూరప్ జనసేన టీమ్’ ఆక్సిజన్ బ్యాంక్ ల ఏర్పాటు కోసం 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఎంతో దూరంలో ఉండి కూడా తమ మాతృభూమిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నిజంగా అభినందనీయం’’ అని చిరంజీవి వారి సేవలకు ప్రశంసలు కురిపించారు. యూరోప్ జనసేన టీంకు నా అభినందనలు అంటూ తెలిపారు.

    ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన రవికృష్ణ ఎర్రంశెట్టి, ప్రతాప్ రేపల్లె , రాజు గరగలకు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘‘బింధువు బింధువు కలిస్తే సింధువు అవుతుందన్న మాట నిజం’ అని.. ఇటువంటి సహాయ కార్యక్రమాలకు అందరూ కలిసి రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. సంఘటితంగా కరోనా రక్కసి పై పోరాడి విలువైన ప్రాణాలను కాపాడాలని సూచించారు. మున్ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఆపదలో ఉన్న ఆపన్నులను ఆదుకొందామని చిరంజీవి అభిమానులను కోరారు. మానవతను చాటుకొందామంటూ ముగించారు.