Etela Rajender: హుజురాబాద్ లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి దృష్ట్యా జీర్ణించుకోలేకపోతోంది. తమ పరాభవానికి కారణమైన ఈటల రాజేందర్ పై ముప్పేట దాడికి ప్రయత్నిస్తోంది. ఎక్కడైనా సరే ఇరుకున పెట్టి పగ తీర్చువాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆయన వ్యాపారాలపై దెబ్బ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని ఆయుధాలు రెడీ చేసుకుంటోంది. ఈటల మెడకు ఉచ్చు బిగించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.

ఈటల(Etela Rajender)కు జమున హేచరీస్ అనే సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఇది మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచే దీనిపై వివాదాలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి వివాదాస్పదంగా మారిన సంస్థపై ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ తీయాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే విచారణ వేగవంతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అప్పట్లో ఎన్నికల వేడి దృష్ట్యా దీనిపై పట్టించుకోకపోయినా ప్రస్తుతం అదే సంస్థపై వివాదాలు మళ్లీ తెరపైకి తెస్తోంది. ఎలాగైనా ఈటలను బలి చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే దురుద్దేశంతో ఇలా చేస్తోందని ఈటల కూడా చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18 వరకు విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఈటలకు నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం. డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వే అచ్చంపేటలోని సర్వే నెంబర్ 130లో 18-20 ఎకరాల అసైన్డ్ భూమి 11 మంది రైతులకు నోటీసులు అందజేసినట్లు తూఫ్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాశ్ తెలిపారు. జమున కోళ్లఫాం ఇందులోనే ఉండటం గమనార్హం. దీంతో ఈటలను ఇలా బలి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
దళితుల భూములను అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలపై ఈటలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఈటలను ఎదుర్కొనేందుకు అన్ని దారులు వెతుకుతోందని తెలుస్తోంది.
Also Read: వెనకబడుతున్న కాంగ్రెస్.. ముందుకెళ్తున్న బీజేపీ
మూడోసారి అధికారమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు.. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు