https://oktelugu.com/

MLC Elections: రెడ్డి వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటున్న కేసీఆర్.. అసలు కారణం ఇదే?

MLC Elections 2021: తెలంగాణలో రాజకీయాలు సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సాధారణంగా కొంత వ్యతిరేకత వస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం బలపడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ…  అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇక ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తరలివచ్చినా అక్కడి సీటును కాపాడుకోలేకపోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఓ రేంజులో ఉందో స్పష్టమవుతోంది. హుజూరాబాద్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2021 / 05:37 PM IST
    Follow us on

    MLC Elections 2021: తెలంగాణలో రాజకీయాలు సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సాధారణంగా కొంత వ్యతిరేకత వస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం బలపడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ…  అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇక ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తరలివచ్చినా అక్కడి సీటును కాపాడుకోలేకపోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఓ రేంజులో ఉందో స్పష్టమవుతోంది.

    MLC Elections KCR

    హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని, బీజేపీ నాయకులను ఏకిపారేశారు. ఈక్రమంలోనే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయడం ఆసక్తిని రేపింది. అయితే ఇదంతా కూడా హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్ ను పక్కదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారనే టాక్ విన్పిస్తోంది.

    ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) నోటిఫికేషన్ వచ్చింది. టీఆర్ఎస్ లో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికీ దక్కుతాయనే చర్చ పెద్దఎత్తున నడిచింది. మంగళవారం నామినేషన్ల చివరి రజుల కావడంతో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికే చెందిన నేతలే ఉండటం గమనార్హం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

    పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఆపార్టీలో కొత్త జోష్ నెలకొంది. అయితే హుజూరాబాద్ లో ఆ మాత్రం డిపాజిట్ దక్కించుకోలేదు. కానీ చాపకింద నీరులా ఆపార్టీ బలపడుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ లో ఒక్కటవుతున్నారు. దీంతో ఈ వర్గానికి టీఆర్ఎస్ లో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ షాకివ్వాలని ప్లాన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగానే ఉంటుందనే అంచనాతోనే ఈ వర్గానికి ఇటీవల అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తోంది. దీనీలో భాగంగా టీఆర్ఎస్ సైతం ఎమ్మెల్సీ కోటాలో రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

    టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేసిన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. మిగిలిన వారిలో బండా ప్రకాశ్(ముదిరాజ్), కడియం శ్రీహరి(ఎస్సీ), తక్కళ్లపల్లి రవీందర్ రావు(వెలమ) ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలు వరుసగా రెండోసారి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానుండగా మిగిలిన అభ్యర్థులు కొత్తగా ఎన్నిక కానున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పెండింగ్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్ కు అవకాశం దక్కింది.

    ఐఏఎస్‌కు రాజీనామా చేసి తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన వెంకట్రామి రెడ్డికి స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ వస్తుందని తొలుత భావించారు. అయితే అనుహ్యంగా ఆయన ఎమ్మెల్యే కోటా కింద నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్‌కు చెందిన బండ ప్రకాష్ ముదిరాజ్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు. పార్లమెంటు ఎగువసభలో ఆయనకు మరో మూడేళ్ల పదవీ కాలం ఉంది. ఆయనను క్యాబినెట్లోకి తీసుకునేందుకు ఎమ్మెల్సీగా నామినేటేడ్ చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది. టీఆర్ఎస్ కు అసెంబ్లీలో 103మంది ఎమ్మెల్యేల బలంగా ఉండటంతో వీరంతా ఏకగ్రీవం కావడం ఖాయం కన్పిస్తోంది.