
TRS-BJP: రాష్ర్టంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించడం సంచలనం కలిగిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలు దఫాలుగా జరుగుతున్న గొడవల కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. ఈ మేరకు పోలీసులను మోహరించినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.
సూర్యపేట జిల్లా అర్వపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ నేతలు రాళ్లు రువ్విన నేపథ్యంలో వివాదం జరిగిన విషయం విధితమే. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ పర్యటనలో భాగంగా ఆత్మకూరు (ఎస్)కు చేరుకున్న ఆయనపై మరోసారి టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు సైతం భారీగా మోహరించినా ఉద్రిక్తత తగ్గలేదు.
బీజేపీ, టీఆర్ఎస్(TRS-BJP) నేతల మధ్య తీవ్ర స్థాయిలో నినాదాలు చేసుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే సమయంలో రిజర్వ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ దృష్ట్యా పర్యటనలకు అనుమతి లేకున్నా సంజయ్ రావడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో శాంతిభద్రతల కోసం రెండు పార్టీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తానికి రాష్ర్టంలో రెండు పార్టీల మధ్య దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లడంతో రాష్ర్ట భవితవ్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
Also Read: ఈటల కేసుల్లో ఇరుక్కుంటారా? పాత కేసులు తిరగదోడుతున్న ప్రభుత్వం