https://oktelugu.com/

ఉద్యమ నాయకుడు.. ఇబ్బందిగా మారుతున్నాడా..?

దశాబ్దం క్రితం గులాబీ పార్టీకి వారు కీలక నాయకులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రథసారథులు.. ఉద్యమకాలంలో పొద్దున లేస్తే.. రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన లీడర్లు.. తెలంగాణ రాష్ట్ర సాకారంలో తమవంతు పాత్ర పోషించిన వీరులు.. రాష్ట్రం సిద్ధించి.. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కొన్ని భజన బ్యాచ్ ల కారణంగా ఉద్యమ నాయకులు ఇప్పుడు గులాబీ వనంలో ముళ్లుగా కనిపిస్తున్నారు. డబ్బాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2021 / 12:42 PM IST
    Follow us on


    దశాబ్దం క్రితం గులాబీ పార్టీకి వారు కీలక నాయకులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రథసారథులు.. ఉద్యమకాలంలో పొద్దున లేస్తే.. రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన లీడర్లు.. తెలంగాణ రాష్ట్ర సాకారంలో తమవంతు పాత్ర పోషించిన వీరులు.. రాష్ట్రం సిద్ధించి.. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కొన్ని భజన బ్యాచ్ ల కారణంగా ఉద్యమ నాయకులు ఇప్పుడు గులాబీ వనంలో ముళ్లుగా కనిపిస్తున్నారు. డబ్బాలు కొట్టేవారు అధినేతకు దగ్గర అవుతుండడంతో నాటి రథ సారథులను కేసీఆర్ దూరం పెడుతున్నారు.

    Also Read: తెలంగాణలోని ఆ జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం.. అన్నం పూర్తిగా మాడిపోవడంతో..?

    టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ క్రమంగా ఈ పార్టీకి దూరం అవుతున్నట్లు అనిపిస్తోంది. ఆయన సొంతంగా కొత్తపార్టీ పెట్టబోతున్నారని సాగుతున్న ప్రచారానికి.. ఆయనతో టీఆర్ఎస్ హై కమాండ్ వ్యవహరిస్తున్న తీరు దీనికి కారణం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. చివరికి హరీష్ రావుకు కూడా ఓ జిల్లా బాధ్యతలను అప్పగించారు. అయితే ఈటల రాజేందరును పట్టించుకోలేదు.

    కాగా మైకు దొరికితే చాలు.. కేసీఆర్ దేవుడికన్నా.. గొప్పవాడని సందేశాలు ఇచ్చే ఉమ్మడి జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. పైగా అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు.. సాగర్ ఉప ఎన్నికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా ఈటల రాజేందర్ కు ఆహ్వానం పంపలేదు. దీంతో ఈటల మనస్తాపానికి గురయ్యారు. వెంటనే కరీంనగర్ వెళ్లిపోయారు. ఈటలకు ఎలాంటి ఆహ్వానం అందని సమయంలో గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యాలు చేశారు.

    Also Read: సమయం లేదు.. ఇక తాడో పేడో.. అమిత్ షాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

    కొంతమంది సొంతపార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అది ఈటలను ఉద్దేశించేనని టీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతోంది. సొంత పార్టీ పెడుతున్నారనే కారణం చూపి.. ఈటలను టీఆర్ఎస్ అధినేత దూరం పెడుతున్నారని.. కానీ ఈటల పార్టీ పెట్టే పరిస్థితితుల్లో లేరని మరికొంత మంది అంటున్నారు. పరిస్థితులు చూస్తే మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నాయి.. ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారడమో.. లేకపోతే.. నిజంగా పార్టీ పెట్టడమో తప్ప.. ఏమీ చేయలని పరిస్థితి ఏర్పడుతోంది. టీఆర్ఎస్ లో … ప్రభుత్వంలో సమూల మార్పులకు కేసీఆర్ ప్లాను చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పరిణామాలు టీఆర్ఎస్ లో చర్చకు కారణం అవుతున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్