ఈటలకు తాయిలాలు: కేంద్ర మంత్రి పదవి హామీ

బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీకి ఆహ్వానించింది. ఆయనకు పలు రకాల హామీలు ఇచ్చిమరీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కు మూడినట్లేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందున హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమైంది.దీంతో అక్కడ ఎవరు పోటీ […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 8:58 pm
Follow us on

బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీకి ఆహ్వానించింది. ఆయనకు పలు రకాల హామీలు ఇచ్చిమరీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కు మూడినట్లేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందున హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమైంది.దీంతో అక్కడ ఎవరు పోటీ చేస్తారనే విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ లో బీజేపీ తరపున ఈటల భార్య జమున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ రాకతో పార్టీ బలపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయనతో మంతనాలు సాగించి ఆయన షరతులకు అంగీకరించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టను పెంచుకునేందకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. పార్టీని ఎలాగైన విజయ తీరాలకు చేర్చాలని వివిధ మార్గాలను వెతికి మరీ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఈటల రాజేందర్ కు రెండు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం, కేంద్రమంత్రిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా బీజేపీ రాష్ర్టంలో బలపడేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ను చేర్చుకోనున్నట్లు చెబుతున్నారు.