జగన్ బాబాయ్ కోరిక నెరవేరుతుందా? టీటీడీ కొత్త చైర్మన్?

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో ఉత్తర్వులు వెలువరించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం జూన్ 21తో ముగియనుండగా ఇప్పుడు ఆ పదవి ఎవరితో భర్తీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన్నేకొనసాగిస్తారా లేక మరెవరిని అయినా నియమిస్తారా అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. టీడీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 9:01 pm
Follow us on

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో ఉత్తర్వులు వెలువరించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం జూన్ 21తో ముగియనుండగా ఇప్పుడు ఆ పదవి ఎవరితో భర్తీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన్నేకొనసాగిస్తారా లేక మరెవరిని అయినా నియమిస్తారా అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.

టీడీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి 2019లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉండగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీటును మాగంటి శ్రీనివాసులు రెడ్డికి కేటాయించారు. దీంతో సుబ్బారెడ్డి కినుక వహించారు. దీంతో ఆయనకు టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. రెండేళ్ల కాలంలో ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చింది.

వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటుపై మక్కువ పెరిగింది. ఈ మేరకు పెద్దల సభకు తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి మూడు సీట్లు దక్కనున్నాయి. దీంతో బాబాయ్ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. పార్టీలో పలువరు సీనియర్లు రాజ్యసభ సీటు కోసం పైరవీలు చేస్తున్నారు. దీంతో సుబ్బారెడ్డి కోరిక తీరుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన హయాంలోనే గీతగోవిందం, కల్యాణమస్తు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో కరుణాకర్ రెడ్డికి చైర్మన్ పదవి ఖాయమైపోయినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో టీటీడీచైర్మన్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.