మూడేళ్ళలో 95 శాతం పనులు పూర్తి..!

మిషన్ భగీరథ పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మంత్రి జగదీష్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. భగీరథ పనులు నిర్లక్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు 95 శాతపూర్తి చేశామన్నారు. మూడు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేయడ శాతం పనులలో లోపాలు ఉన్నాయన్నా అందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలను వెంటనే అక్కడి నుంచి మార్చాలన్నారు. ఇప్పటికే […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 6:54 pm
Follow us on

మిషన్ భగీరథ పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మంత్రి జగదీష్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. భగీరథ పనులు నిర్లక్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు 95 శాతపూర్తి చేశామన్నారు. మూడు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేయడ శాతం పనులలో లోపాలు ఉన్నాయన్నా అందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలను వెంటనే అక్కడి నుంచి మార్చాలన్నారు. ఇప్పటికే చాలా మందిని మార్చం, ఇంకా కొందరిని మార్చాల్సి ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ఏజెన్సీల నిర్లక్ష్యం ఈ పథకానికి శాపంగా మారకూడదన్నారు.

మరోవైపు మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసమే మిషన్‌ భగీరథ పథకం రూపుదాల్చింన్నారు. అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీటినిఅందించే బృహత్తర పథకం మిషన్‌ భగీరథ అని అన్నారు. ఫ్లోరిన్‌ ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే పైలాన్‌ నిర్మాణం జరిగిందన్నారు. నది జలాలు నేరుగా ఇంటింటికి అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్ట్‌ పనులు దాదాపుగా పూర్తి చేయడం ప్రసంశించదగ్గ విషయమన్నారు. పనులన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలన్నారు.