కీచక ఎస్ఐపై సస్పెన్షన్ వేటు..!

మహిళలకు రక్షణ కల్పించి ఆదుకోవాల్సిన పోలీసు అధికారి ఓ యువతి పట్ల అమానుషంగా వ్యవహరించిన సంఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జిల్లాలోని అమరావతిలో ఎస్సైగా పనిచేస్తున్న రామాంజనేయులు విశ్రాంతి నెపంతో లాడ్జిలో తిష్ట వేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో లాడ్జిలో రౌడీషీటర్లతో మందు, విందులలో పాల్గోన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లాడ్జికి చేరుకున్న ఓ జంటను గమనించాడు. వారిని విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించాడు, అలా చేయకుండా […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 6:38 pm
Follow us on


మహిళలకు రక్షణ కల్పించి ఆదుకోవాల్సిన పోలీసు అధికారి ఓ యువతి పట్ల అమానుషంగా వ్యవహరించిన సంఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జిల్లాలోని అమరావతిలో ఎస్సైగా పనిచేస్తున్న రామాంజనేయులు విశ్రాంతి నెపంతో లాడ్జిలో తిష్ట వేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో లాడ్జిలో రౌడీషీటర్లతో మందు, విందులలో పాల్గోన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లాడ్జికి చేరుకున్న ఓ జంటను గమనించాడు. వారిని విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించాడు, అలా చేయకుండా ఉండాలంటే రూ. పదివేలు లంచం డిమాండ్ చేశాడు. రూ. ఐదు వేలు ఇచ్చేందుకు సిద్ధమైన యువకుడు డబ్బులు తెచ్చేందుకు ఏటీఎంకు వెళ్ళడంతో యువతిని తన కామవాంచ తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. మహిళ ఎదురుతిరగడంతో ఎస్ఐ వెనక్కి తగ్గాడు. అమరావతిలోని ప్రసాద్ యాత్రికుల వసతి గృహంలో ఈ సంఘటన చోటు చేసుకుంది తుళ్ళూరు డియస్‌పికి యువతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అమరావతి లాడ్జిలో జరిగిన ఎస్సై ఉదంతం వాస్తవమని విచారణలో తేలిందని రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. . ఎస్ఐ వ్యవహారంపై తుళ్లూరు డీఎస్పీ ప్రాధమిక విచారణ జరిపించినట్టు తెలిపారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రామాంజనేయులును సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రామాంజనేయులు పరారీలో ఉన్నాడన్నారు. ఎస్సైతో పాటు అతని ప్రైవేట్ డ్రైవర్‌పై కేసులు నమోదు చేశామన్నారు. విధి నిర్వాహణలో ఎవ్వరూ తప్పు చేసిన తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.