నేచురల్ స్టార్ నాని నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ’ హిందీలో భారీ స్థాయిలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ లో హీరోగా అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ కి హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించనుంది. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. కాగా ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. కానీ అర్జున్ రెడ్డి బోల్డ్ మూవీ, జెర్సీ దానికి అపోజిట్.
మరి అర్జున్ రెడ్డిలా జెర్సీ వర్కౌట్ అవుతుందా ? ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ నెల లాస్ట్ వీక్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చండీగఢ్ లో మొదలుకానుంది. చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. ముఖ్యంగా లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ అన్ని అక్కడే షూట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్స్ కూడా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా చెబుతుంది.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నవంబర్ 28వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట.