Celebrities: ప్రముఖుల భద్రతకు పెద్దపీట వేయడం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పుడు అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అత్యంత ముఖ్యమైన ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. త్రివిధ దళాలకు దిశా నిర్దేశం చేసే ఆయన అకాల మరణం చెందడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మన ఉమ్మడి రాష్ర్టంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే తీరుగా ప్రమాదంలో మరణించడం విధితమే. అప్పట్లో కూడా అది సంచలనంగా మారింది. ఆయన మృతిపై కూడా పలు కోణాల్లో ఆరోపణలు వచ్చినట్లు తెలిసిందే. ప్రస్తుతం బిపిన్ రావత్ విషయం కూడా అందరిలో అనుమానాలు పెంచుతోంది.
భారత సైన్యానికి పెద్ద దిక్కుగా ఉన్న బిపిన్ రావత్ మరణం తీరని లోటు. ఒక మంచి వ్యూహకర్తను కోల్పోవడంతో ఇక ఆపరేషన్లు నిర్వహించడం కష్టంగా మారనుందని తెలుస్తోంది. మరో వ్యూహకర్తను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బిపిన్ రావత్ మరణం యావత్ దేశాన్ని కూడా ఆందోళనకు గురి చేసింది. సైన్యానికి తగిలిన పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.
Also Read: PM Modi: బిపిన్ రావత్.. అందుకే ప్రధాని మోడీకి ఇష్టమట..
దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు కొత్త కాకపోయినా వాటి భద్రతపై దృష్టి సారిస్తున్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఓ కారణంతో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కానీ దేశానికి అవసరమైన వారు కావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికైనా హెలికాప్టర్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గుర్తించాల్సి ఉంటుంది.
Also Read: Bipin Rawath: బిపిన్ రావత్ మరణం అనుమానాస్పదం.. బాంబు పేల్చిన సుబ్రహ్మణస్వామి