Elon Musk : మన సమాజంలో డబ్బున్న వారిని చూసే విధానం ఒక తీరుగా ఉంటుంది. డబ్బు లేని వాళ్లను చూసే తీరు మరో విధంగా ఉంటుంది. అందువల్లే ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు చుట్టూ.. డబ్బు వల్ల.. డబ్బు కోసమే ప్రపంచం తిరుగుతుంది కాబట్టి పైసా మే పరమాత్మ అనే నానుడి పుట్టింది. ఇక నేటి స్మార్ట్ కాలంలోనూ డబ్బున్న వాడికే విలువ.. డబ్బున్న వాడికే పరపతి.. డబ్బు ఉన్నవాడికే ఉత్తమ స్థితి.. అందువల్లే డబ్బున్న వాడు కొండమీద కోతినైనా తీసుకు రాగలడు. అరచేతిలో అద్భుతాలను సృష్టించగలడు అంటారు.. అలాంటి వారిలో ఎలాన్ మస్క్ ఒకడు. ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడుగా కొనసాగుతున్నాడు. ఇతడి వద్ద ఉన్న సంపద జింబాబ్వేలాంటి దేశాల 10 సంవత్సరాల బడ్జెట్ కు సమానం. చిన్న చిన్న దేశాలను మస్క్ సులభంగా కొనేయగలడు. టెస్లా, ట్విట్టర్ ఎక్స్, స్పేస్ ఎక్స్ వంటి వ్యాపారాలను మస్క్ నిర్వహిస్తున్నాడు. అంతేకాదు అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్నాడు.
Also Read : లవర్ ను అమ్మను చేసిన ప్రపంచ కుబేరుడు.. 14వ బిడ్డకు వెల్ కమ్.. ఎంతమందిని కంటావ్ మస్క్ మామ ?
14 మందికి తండ్రి
మస్క్ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. లెక్కలేని కంపెనీలు ఉన్నాయి. అందువల్లే మస్క్ తన విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతీతో సహజీవనం చేస్తున్నాడు. వివిధ పద్ధతుల్లో 14 మందిని కన్నాడు. ఇంకా ఎంతమందిని కంటాడో తెలియదు. కానీ మస్క్ చేస్తున్న పనిని ఏ ఒక్క మీడియా సంస్థ విమర్శించలేదు. ఏ దేశాధినేత కూడా తప్పు పట్టలేదు. పైగా మస్క్ తనకు 14 మంది పిల్లలు అని చెప్పగా.. మీడియా చెవులు రిక్కరించి మరి ఆ మాటలు విన్నది. మహా గొప్పగా పబ్లిష్ చేసింది. మరి ఇదే పని ఓ పేదవాడు చేస్తే ఈ మీడియా ఇలానే ఉంటుందా? ఇలానే వార్తలు రాస్తుందా? ఈ ప్రశ్నలకు లేదు, కాదు అనే సమాధానాలే వస్తాయి. ఎందుకంటే మన మీడియా.. మన వ్యవస్థలు.. మన ప్రభుత్వాలు డబ్బు ఉన్న వాడికి మాత్రమే ఊడిగం చేస్తాయి. పేదవాడు వస్తే తోక జాడిస్తాయి. ఇలాంటప్పుడే కదా సమాజం మీద మనకు ఏవగింప కలిగేది. కోపం వచ్చేది. అలా కోపం వచ్చి. కసి పెరిగితే మస్క్ లాంటివాళ్లే వస్తూ ఉంటారు. సమాజం మీద తమదైన ముద్ర వేసి వెళ్ళిపోతారు.. అది మంచి కావచ్చు.. చెడు కూడా అయి ఉండవచ్చు.. ఏదో ఒక విషయంలో మాత్రం తమదైన ముద్రను వేస్తారు. ఇలాంటి వాళ్లు లోకం గురించి భిన్నంగా మాట్లాడుకోవడంలో తప్పులేదు కదా! అన్నట్టు మస్క్ 14 మందితోనే ఆగడు.. అయిదుగురు భార్యలతోనే వదిలిపెట్టడు.. ఎందుకంటే అతడు విలాస పురుషుడు.. అన్నింటికీ మించి లెక్కకు మిక్కిలి డబ్బు ఉన్నవాడు..
Also Read : ఆర్థిక నేరగాడి మరో సంచలన లేఖ.. ఈసారి ప్రపంచ కుబేరుడికే.. ఆఫర్ ఎంతిచ్చాడో తెలుసా?