T20 and CT : 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వెళ్లినప్పటికీ.. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ.. టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడికి గురైంది. ఆస్ట్రేలియా చేతిలో తలవంచింది.. తద్వారా మరోసారి వన్డే వరల్డ్ కప్ ఆశను దూరం పెట్టేసుకుంది. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ క ప్ దక్కించుకోవాలనే కలను.. కలగానే ఉంచింది. 2021 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరిగింది.. న్యూజిలాండ్ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2023లో వరల టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరిగింది. అందులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇక లార్డ్స్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో టీమ్ ఇండియాకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఎవరైన ఓటములు టీమ్ ఇండియాకు ఆ అవకాశం లేకుండా చేశాయి. ఇక టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నెగ్గాలి అంటే 2027 వరకు ఎదురు చూడక తప్పదు. ఇక వన్డే వరల్డ్ కప్ 2027 లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమిబియా వేదికగా జరుగుతుంది. అంటే ఈ లెక్కన మరో రెండు సంవత్సరాల పాటు రోహిత్ శర్మ తన కెరియర్ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతడి వయసు 37 సంవత్సరాలు. క్రికెట్లో 39 సంవత్సరాలు అనేది కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ నాలుగు పదుల వయసులోనూ అద్భుతమైన కెరియర్ కొనసాగించాడు. ఆ లెక్కన చూసుకుంటే రోహిత్ కు అతిపెద్ద కష్టం కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ ఆడిన తీరు అద్భుతం. వికెట్ల మధ్య పరిగెత్తిన తీరు కూడా అనన్య సామాన్యం.
Also Read : నెట్స్ లో చెమటోడ్చిన హార్దిక్, రోహిత్.. వైరల్ వీడియో
అవి రెండు దక్కాలంటే..
వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ దక్కాలంటే టీమిండియా స్థిరమైన ఆట తీరు కొనసాగించాలి. వైట్ బాల్ ఫార్మాట్ పక్కన పెడితే.. రెడ్ బాల్ ఫార్మాట్లో తీవ్రంగా కసరత్తు చేయాలి. ముఖ్యంగా ఆటగాళ్లు క్రీజ్ లో నిలబడేందుకు ప్రయత్నించాలి. వన్డే తరహాలోనే ఆడతామంటే టెస్టులలో కుదరదు. ఎందుకంటే టెస్టు అనేది భిన్నమైన క్రికెట్. ఆటగాడు లయను కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు పెర్త్ టెస్టు మినహా.. మిగతా అన్ని మ్యాచ్లలో తమ లయను కోల్పోయారు. చివరికి రోహిత్ లాంటి ఆటగాడు కూడా చేతులెత్తేశాడు. అందువల్లే టెస్ట్ ఆడే ఆటగాళ్లు స్థిర చిత్తం తో ఉండాలి. ఏ మాత్రం విచక్షణ కోల్పోయినా తేడా వచ్చేస్తుంది. ఇక వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా 2027లో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో ఆడుతుంది. అక్కడ పరిస్థితులకు అలవాటుపడేలాగా.. మెరుగైన ఆట తీరు కొనసాగించేలాగా ఉండాలంటే.. కచ్చితంగా ఇదే దూకుడు కొనసాగించాలి. అప్పుడే టీమిండియా మిషన్ 2027 లక్ష్యం పూర్తవుతుంది. అప్పుడు గాని రోహిత్ శర్మ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేందుకు వీలవుతుంది. పైవన్నీ జరగాలంటే కచ్చితంగా ఆటగాళ్లు ఇంతకుమించి ఆట తీరు కొనసాగించాలి.
Also Read : సీనియర్ల, జూనియర్ల కలయిక.. ఇంగ్లాండ్ తో టీ -20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే..