Rajya Sabha Elections: ఎట్టకేలకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని రాష్ట్రాల్లో భర్తీ కాకుండా ఉన్న 57 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 31 నామినేషన్లకు చివరి రోజుగా నిర్ణయించారు. దీంతో ఇక అభ్యర్థుల ప్రకటనే తరువాయి భాగం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలదే హవా కావడంతో పదవులు కూడా వారినే వరించనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఎవరి పేర్లు సూచిస్తాయో ఎవరిని నిలబెడతాయోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలు ఉన్నాయి. ఏపీలో విజయసాయిరెడ్డి, అదానీ భార్య, మై హోం అధినేత రామేశ్వర్ రావుకు కేటాయించగా ఇంకా ఒక స్థానం విషయంలో మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఆ ఒక్కటి ఎవరికి ఇస్తారోననని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక తెలంగాణలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంతవరకు ఎవరి పేర్లు ప్రకటించలేదు.దీంతో కేసీఆర్ టికెట్లు ఎవరికి కేటాయిస్తారో తెలియడం లేదు.
Also Read: CM KCR: కేసీఆర్ మళ్లీ మౌనం.. ఈసారి ఎవరికి మూడుతుందో?
తెలంగాణలో డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాలను ఎవరికి ఇస్తారో కూడా అంతుచిక్కడం లేదు. ఏపీలో వైసీపీకి 151 సీట్లుండగా రాజ్యసభ సభ్యుల ఎంపిక బాధ్యత జగన్ మీదే ఉంది. కానీ ఆయన మదిలో ఎవరున్నారో తెలియడం లేదు. ఏదో ముగ్గురి పేర్లు బయటకు వస్తున్నా చివరికి ఎవరి పేర్లు ఖరారు అవుతాయో అనే సందేహాలు వస్తున్నాయి. కానీ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

ఇక తెలంగాణలో అయితే ఎవరి పేర్లు కూడా బయటకు రావడం లేదు. కేసీఆర్ మదిలో ఎవరి పేర్లు ఉన్నాయో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని ప్రకటిస్తారో తెలియడం లేదు. ఇప్పటివరకు ఎవరనే దానిపై సంశయాలే వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఇస్తారని తెలిసినా వారు ఎవరనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తేలడం లేదు.
Also Read:Gadapa Gadapaku YCP: గడగడపకు వెళితే గట్టి దెబ్బే.. వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు
Recommended Videos



