Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీతో దేశ రాజకీయాలను శాసించడం సాధ్యం కాదని చెప్పిన ఆయనే ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకి ఉందని చెబుతున్నారు. కాంగ్రెసేతర పక్షాలతో మూడో కూటమి సాధ్యం కాదని పేర్కొంటున్నారు. దీంతో నేతల్లో కూడా అంతర్మథనం ప్రారంభమైంది. పీకే మాటల్లో అంతరార్థం ఏమిటో అర్థం కావడం లేదు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న పీకే తరువాత కాలంలో మోడీని దించడం అంత సులువు కాదని చెప్పడం గమనార్హం. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన రాహుల్ గాంధీ భజన చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని కొత్త పల్లవి అందుకోవడంతో అందరిలో అయోమయం నెలకొంది. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర స్టేట్లలో ప్రాంతీయ పార్టీల విజయాలకు ప్రధాన భూమిక పోషించిన పీకే వ్యూహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలని చూస్తున్నారు.
బీహార్ లో కూడా నితీష్ కుమార్ గెలుపుకు కారణమైన పీకే తరువాత కాలంలో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఓడించి అధికారం చేపట్టడం అంత సులభమైన పని కాదని తెలిసినా పీకేలో ఏ ధైర్యం ఉందో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలకే అధికారం అందనంత దూరం ఉందని తెలుస్తున్నా పీకే మాత్రం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని నమ్మడం విచిత్రమే.
Also Read: Karnataka Ex Speaker : అత్యాచారం చేస్తే.. ఎంజాయ్ చేయాలి! అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు
రాబోయే ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు పీకే ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరత్ పవార్ లాంటి వారిని కలిసినా వారు పెద్దగా స్పందించలేదు. దీంతో పీకే ఏ మేరకు అందరిని ఏకతాటిపైకి తీసుకొస్తారో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నా అది ఏమేరకు ఫలితం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Modi vs TDP: బీజేపీ-టీడీపీ పొత్తుకు అవకాశమే లేదు.. చంద్రబాబుకు షాకిచ్చిన మోడీ