Huzurabad By Elections: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హుజూరాబాద్ లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ ఎన్నికల కంటే ముందే అక్కడ ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఎన్నికల్లో దాన్నే అమలు చేస్తోంది. ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందని అంటున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. విరాట్ కు షాకిచ్చింది.
ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.
ఎన్నికల వేళ ఈ పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆపుచేయడం ఖచ్చితంగా దెబ్బేనని అంటున్నారు. ఈ పథకం కొనసాగితే టీఆర్ఎస్ కు కొంచె ఎడ్జ్ ఉండేది కానీ.. బీజేపీ పక్కా వ్యూహంతోనే ఫిర్యాదు చేసి ఈసీ ద్వారా ఈ పథకానికి అడ్డుకట్ట పడేసిందని అంటున్నారు.
ఎన్నికలకు ఇంకా 12 రోజుల సమయం ఉంది. ఇప్పుడు ఈసీ తీసుకున్ననిర్ణయంతో హుజూరాబాద్ లో ఈ పథకానికి బ్రేక్ పడనుంది. సరిగ్గా టైం చూసి బీజేపీ ఈ దెబ్బకొట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ పరిణామం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచిచూడాలి.