Jabardasth Adirindi Satya sree: తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షో ‘బజర్ధస్త్’(Jabardasth). అయితే అక్కడ ఎంత కామెడీ పండినా కూడా ఆడవాళ్ల వేషాల్లో మగవాళ్లు కనిపించి వెగటు పుట్టించేవారు. కానీ జబర్ధస్త్ లోనూ లేడీ కమెడియన్లు కామెడీ పండించగలరని నిరూపిస్తూ.. జబర్ధస్త్ కే ‘ఆడతనాన్ని’ పరిచయం చేసిన నటి సత్య శ్రీ. అప్పటివరకు మగవాళ్లే ఆడవాళ్ల వేషాల్లో కొంచెం వెగటు పుట్టించేలా నటిస్తున్న తరుణంలో ‘సత్యశ్రీ’(Satya Sree) వచ్చి జబర్ధస్త్ కే కళ తెచ్చింది. అమ్మాయిలుంటే ఎంత అందంగా షో నడుస్తుందో చవిచూపించింది. జబర్ధస్త్ లోనూ ఆడవాళ్లు నటించి చూపించగలరని.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
జబర్ధస్త్ కామెడీ షోలో ఎక్కువగా అబ్బాయిలే కనిపించేవారు. అమ్మాయిలు చేయలేక కాదు కానీ.. ఎక్కువగా స్కిట్ లలో ఒకరిని ఒకరు ముట్టుకోవడం.. హగ్ లు, చిలిపి చేష్టలు చేస్తారు కాబట్టి అమ్మాయిలను తీసుకునేవారు. కానీ ఈ కట్టుబాట్లను సత్యశ్రీ బ్రేక్ చేసింది. సత్తా చాటింది. ఫ్యామిలీ స్కిట్ లతో పద్ధతిగా కామెడీ చేసే జబర్ధస్త్ ఒకప్పటి కమెడియన్ చమ్మక్ చంద్ర స్కిట్ లో ‘సత్యశ్రీ’ని తీసుకొని కామెడీ పండించాడు. ఇప్పుడు అతడితోపాటు ‘కామెడీ స్టార్స్’, అదిరింది ప్రోగ్రాంలలోనూ సత్యశ్రీ స్కిట్లు చేస్తూ తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ లేడి కమెడియన్ గా పేరు సంపాదించింది..
సత్యశ్రీ ఎంట్రీ తర్వాత జబర్ధస్త్ లోకి రోహిణి, వర్ష, పవిత్ర లాంటి లేడి కమెడియన్లు వరుసగా స్కిట్లు చేస్తూ మంచి ఫేం సంపాదించుకున్నారు. ఈ క్రెడిట్ మొత్తం సత్యశ్రీది మాత్రమే అని అనలేం కానీ.. జబర్ధస్త్ లో లేడి కమెడియన్ల ఎంట్రీకి ఓ రూట్ వేసింది మాత్రం సత్యశ్రీ అని చెప్పాలి.
జబర్ధస్త్, అదిరింది.. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రసిద్ధి చెందిన కామెడీ షోలు. అనేకమంది కొత్త కళాకారులకు ఇవి ఊపిరిపోశాయి. జీవితాన్ని ఇచ్చాయి. అన్నింటికంటే పాపులర్ అయ్యింది ‘జబర్ధస్త్’. అయితే అందులో అనాదిగా మగవాళ్లే ఆడవాళ్ల వేషంలో వస్తూ కర్ణకఠోరంగా నటించేవారు కామెడీ పండినా ఆ మహిళలు, యువతులు లేని లోటు.. ఆ ఫ్లేవర్ మిస్ అయ్యేది.
ఈ లోటును భర్తీ చేస్తూ నాడు జబర్ధస్త్ కమెడియన్ గా చేసిన చమ్మక్ చంద్ర తన టీంలోకి తొలిసారి లేడీ ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆమె నటి ‘సత్యశ్రీ’. ఆమె తన నటనాశైలి, డ్యాన్స్, పంచ్ డైలాగులతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ జబర్ధస్త్ లో పాపులర్ అయ్యి సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది.
సత్యశ్రీ అంతకుముందు ‘రాజా ది గ్రేట్’, కొన్ని షార్ట్ ఫిలింలలో కూడా నటించింది. ఇటీవల ఆర్డీఎక్స్ లవ్ లోనూ నటించింది.
-సత్యశ్రీ బయోగ్రఫీ..
సత్యశ్రీ హైదరాబాద్ లో జన్మించింది. డిగ్రీ వరకూ చదువుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరనివాసం ఉంటోంది. సత్యశ్రీ హాబీల విషయానికి వస్తే ఆమె నాన్ వెజిటేరియన్. మాంసాహార పదార్థాలు ఎక్కువగా తింటుంది. ఇక సినిమాల్లో నటించాలన్నది ఆమె కళ. ప్రస్తుతం బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా పాతల్లో మెప్పిస్తోంది. మొదట సినిమా అవకాశాల కోసం ట్రై చేసింది. రాకపోవడంతో బుల్లితెర వైపు ఆమె అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర పరిచయం కావడంతో ఆమె దశ తిరిగింది. జబర్థస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక తిరిగి చూసుకోలేదు. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే చమ్మక్ చంద్ర వల్లేనంటూ సత్యశ్రీ చెబుతోంది.