MLA Rajaiah : ఈ పిల్లలు నా వల్లే పుట్టారని.. మళ్ళీ నోరుజారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య

MLA Rajaiah: వదిలిన బాణం.. విడిచిన మాట రెండూ డేంజరే.. ఎక్కడ టంగ్ స్లిప్ అయినా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఓ ఆట ఆడుకుంటున్నారు. నెట్ లో బట్టలిప్పి బరివాత నిలబెట్టేలా ట్రోల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్య కూడా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.. తన ప్రజాసేవ విషయంలో నోరుజారి అడ్డంగా ఇరుక్కున్నాడు. స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నోరు జారారు. ఒక అర్థంలో మాట్లాడబోయి ఇంకో అర్థంలోకి మారిపోయారు. దీంతో […]

Written By: NARESH, Updated On : October 18, 2021 9:03 pm
Follow us on

MLA Rajaiah: వదిలిన బాణం.. విడిచిన మాట రెండూ డేంజరే.. ఎక్కడ టంగ్ స్లిప్ అయినా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఓ ఆట ఆడుకుంటున్నారు. నెట్ లో బట్టలిప్పి బరివాత నిలబెట్టేలా ట్రోల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్య కూడా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.. తన ప్రజాసేవ విషయంలో నోరుజారి అడ్డంగా ఇరుక్కున్నాడు.

స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నోరు జారారు. ఒక అర్థంలో మాట్లాడబోయి ఇంకో అర్థంలోకి మారిపోయారు. దీంతో వివాదాస్పదమవుతోంది. ఆయన ఇప్పటికే పలుమార్లు పలు వివాదాల్లో దూరినా ప్రస్తుతం అచ్చంగా దొరికిపోయారు. తొందరలో మాట్టాడారో కావాలనే చెప్పారో కానీ తెలియడం లేదు. కానీ తన నోటి దురుసుతనంతో ప్రతిసారి ఏదో సందర్భంలో బుక్కవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా నిర్వహించిన ఓ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా రాజయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకముందు తాను ఒక ప్రముఖ పిల్లల డాక్టర్ ను అని.. ఎంతో మందికి ఉచితంగా సేవ చేశానని చెప్పుకొస్తూ నోరు జారారు. చాలా మంది నేను చేసిన సేవలకు ‘‘
ఈ పిల్లలు నీ వల్లే పుట్టారని తనను అభినందిస్తున్నారని’’ బహిరంగ సభలో నోరుజారారు.

లక్షాది మంది పిల్లలు ప్రాణాలు నిలబెట్టిన చరిత్ర తనదని వ్యాఖ్యలు చేస్తూ ఇలా ఠంగ్ స్లిప్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఇలా నోరు జారారు..

ఉద్దేశ పూర్వకంగానే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా..? లేక టంగ్ స్లిప్ అవుతున్నారా అని ప్రజల్లో చర్చ ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపై ట్రోల్స్ సాగుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియో..