Homeజాతీయ వార్తలుEight Years of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలన ఎలా వుంది ?

Eight Years of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలన ఎలా వుంది ?

Eight Years of Modi Govt: ప్రధానమంత్రి ఐన తర్వాత నరేంద్రమోడీ ఈ ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించారు. దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. రాజకీయాలకు అతీతంగా అనేక ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టారు. దేశాన్నిఅనిశ్చితి నుంచి అభివృద్ధి వైపు మళ్లించగలిగారు. సమాజంలోని అన్ని రంగాలలో మార్పు తెచ్చేందుకు “ఆత్మనిర్భర్ భారత్ “ద్వారా అనేక మార్పులు తెచ్చారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్’ వాగ్దానం తో నూతన భారతదేశాన్ని నిర్మించేందుకు పునాది వేశారు మోడీ. ఎనిమిదేళ్లలో ప్రతి ఒక్కరూ పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలను అందుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రపంచా న్ని కరోనా మహమ్మారి కారణంగా అకుంటిత దీక్షతో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ధేందుకు సమర్థవంతమైన విధానాలను అమలు చేశారు. ప్రపంచ ధనిక దేశాలు సైతం కోలుకోలేని దెబ్బతిన్నతరుణంలో భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక పథకాలను అమలు చేశారు. స్వచ్ఛ్ భారత్ మిషన్…ఈ పథకం అత్యంతగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. దేశవ్యాప్తంగా ఉన్న11 కోట్లకు పైగా కుటుంబాలలో 2.61 కోట్ల కుటుంబాలు లబ్ది పొందాయి. 57,500 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి, వీటి నిర్వహణ ద్వారా వేలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

Eight Years of Modi Govt
Modi

కరోనా మహమ్మారి అన్నిరంగాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. మోడీ వంటి నాయకుడు పాలనా సారథ్యంలో ఉండటం భారతదేశం అదృష్టమేనని చెప్పాలి. సమర్థవంతమైన విధానాలు, కార్యక్రమాల ద్వారా ఆయన సమయానుకూల నిర్ణయా ల కారణంగా, భారతదేశం దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగ లిగారు. కరోనా దెబ్బకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. అయినప్పటికీ135 కోట్ల మంది భారతీయులను ఆ బాధ నుంచి విముక్తులను చేయడానికి ప్రధానమంత్రి అవసరమైన విధానాలను రూపొందించారు.

Also Read: Janasena Alliance: ‘పొత్తు’పై క్లారిటీ..: ఇక జనసేన దూకుడు..

Eight Years of Modi Govt
Modi

అందులోభాగంగానే ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సినేషన్ అందించారు. అంతేకాదు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా బాధితులకు ఉచిత చికిత్స అందించి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడగలిగారు. ఇటీవల యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోవిడ్ మహమ్మారిని “విజయవంతంగా” నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. కరోనావైరస్ పై చాకచక్యంగా వ్యవహరించడంలో అనేక ధనికదేశాలు సైతం విఫలమయ్యాయి. ప్రణాళికా బద్ధంగా భారతదేశంలో అనేక కొత్తపథకాలను అమలు చేసి అన్ని రంగాలకు చేయూతని చ్చేందుకు కృషి చేశారు ప్రధాని మోడీ. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ప్రజాసంక్షేమ పథకాలు అందించింది.

Eight Years of Modi Govt
Modi

ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా , బేటీ బచావో, బేటీ పఢావో వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో మైలురాళ్లు కాగా, జెమ్ పోర్టల్, జన్ ధన్ యోజన, ఆధార్ , డిజిటల్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరిగే లావాదేవీలు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను తీసుకొచ్చాయి.
మోదీ పాలనలో అత్యంతకీలకమైన అంశం ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌. ఇది ఆధార్‌తో మొదలైంది. దీని తర్వాత జన్ ధన్ ఖాతాల ద్వారా జనాలకు ఆర్ధిక చేయూత అందించారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో భారతదేశం వాటా 40 శాతంపెరిగింది.
పానీపూరీ విక్రేతలు, కూరగాయల విక్రేతలకు కూడా క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో తేవడం ద్వారా వారిని డిజిటల్ ప్రపంచానికి పరిచయం చేసినఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది.

Also Read: Ktr And Prashanthkishore: పీకే చెప్పిన ప్రకారమే టిక్కెట్లు..కేటీఆర్: ఆ నేతల్లో గుబులు

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version