Poonam Bajwa: వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్ బజ్వా… సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేస్తూ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా పూనమ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సంచలనంగా మారింది. షార్ట్, టాప్ ధరించి బీచ్ లో కవ్వించే కోణాల్లో అందాలు ఆరబోశారు. పూనమ్ తెగింపు చూసి నెటిజెన్స్ ఔరా అంటున్నారు. ఇక తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు.
ఫార్మ్ లో ఉన్నప్పుడు గ్లామర్ షో చేయకుండా ఫేడ్ అవుట్ అయ్యాక మొదలుపెట్టింది పూనమ్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి పూనమ్ ముప్పై సినిమాల వరకూ చేశారు. అయితే ఆమె ఎక్కడా నిలదొక్కుకోలేకపోయారు. తెలుగులో ఆమె కెరీర్ మొత్తం టూ టైర్ హీరోలతోనే సాగింది. పూనమ్ కెరీర్ మొదలైంది కూడా తెలుగులోనే. 2005లో విడుదలైన ‘మొదటి సినిమా’ ఆమె డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో నవదీప్ హీరోగా నటించారు.
Also Read: Eight Years of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలన ఎలా వుంది ?
పూనమ్ కి దక్కిన పెద్ద ఆఫర్ బాస్ మూవీ. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా పూనమ్ సెకండ్ హీరోయిన్ గా చేశారు. బాస్ అనుకున్నంత విజయం సాధించలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు మూవీలో ఆమెకు కీలక రోల్ దక్కింది. ఆ సినిమా విజయం సాధించినా.. పూనమ్ ని ఆ చిత్ర హీరోయిన్ గా కన్సిడర్ చేయలేం. దీంతో పరుగు హిట్ క్రెడిట్ ఆమెకు దక్కలేదు.
పరుగు తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. వరుసగా తమిళ చిత్రాలు చేశారు. చాలా గ్యాప్ తర్వాత 2019లో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. ఆ రెండు చిత్రాల విజయం పైనే పూనమ్ కెరీర్ ఆధారపడి ఉంది. తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు వచ్చే సూచనలు లేవు. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా… దర్శక నిర్మాతలకు గ్లామర్ రోల్స్ కి సిద్ధం అన్నట్లు సంకేతాలు పంపుతుంది.
Also Read: Virata Parvam: విరాటపర్వం నుండి క్రేజీ అప్డేట్.. రానా పాడితే ఎలా ఉంటుందో చూడండి!