Eight Years of Modi Govt: ప్రధానమంత్రి ఐన తర్వాత నరేంద్రమోడీ ఈ ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించారు. దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. రాజకీయాలకు అతీతంగా అనేక ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టారు. దేశాన్నిఅనిశ్చితి నుంచి అభివృద్ధి వైపు మళ్లించగలిగారు. సమాజంలోని అన్ని రంగాలలో మార్పు తెచ్చేందుకు “ఆత్మనిర్భర్ భారత్ “ద్వారా అనేక మార్పులు తెచ్చారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్’ వాగ్దానం తో నూతన భారతదేశాన్ని నిర్మించేందుకు పునాది వేశారు మోడీ. ఎనిమిదేళ్లలో ప్రతి ఒక్కరూ పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలను అందుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రపంచా న్ని కరోనా మహమ్మారి కారణంగా అకుంటిత దీక్షతో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ధేందుకు సమర్థవంతమైన విధానాలను అమలు చేశారు. ప్రపంచ ధనిక దేశాలు సైతం కోలుకోలేని దెబ్బతిన్నతరుణంలో భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక పథకాలను అమలు చేశారు. స్వచ్ఛ్ భారత్ మిషన్…ఈ పథకం అత్యంతగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. దేశవ్యాప్తంగా ఉన్న11 కోట్లకు పైగా కుటుంబాలలో 2.61 కోట్ల కుటుంబాలు లబ్ది పొందాయి. 57,500 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి, వీటి నిర్వహణ ద్వారా వేలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
కరోనా మహమ్మారి అన్నిరంగాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. మోడీ వంటి నాయకుడు పాలనా సారథ్యంలో ఉండటం భారతదేశం అదృష్టమేనని చెప్పాలి. సమర్థవంతమైన విధానాలు, కార్యక్రమాల ద్వారా ఆయన సమయానుకూల నిర్ణయా ల కారణంగా, భారతదేశం దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగ లిగారు. కరోనా దెబ్బకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. అయినప్పటికీ135 కోట్ల మంది భారతీయులను ఆ బాధ నుంచి విముక్తులను చేయడానికి ప్రధానమంత్రి అవసరమైన విధానాలను రూపొందించారు.
Also Read: Janasena Alliance: ‘పొత్తు’పై క్లారిటీ..: ఇక జనసేన దూకుడు..
అందులోభాగంగానే ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సినేషన్ అందించారు. అంతేకాదు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా బాధితులకు ఉచిత చికిత్స అందించి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడగలిగారు. ఇటీవల యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోవిడ్ మహమ్మారిని “విజయవంతంగా” నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. కరోనావైరస్ పై చాకచక్యంగా వ్యవహరించడంలో అనేక ధనికదేశాలు సైతం విఫలమయ్యాయి. ప్రణాళికా బద్ధంగా భారతదేశంలో అనేక కొత్తపథకాలను అమలు చేసి అన్ని రంగాలకు చేయూతని చ్చేందుకు కృషి చేశారు ప్రధాని మోడీ. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ప్రజాసంక్షేమ పథకాలు అందించింది.
ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా , బేటీ బచావో, బేటీ పఢావో వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో మైలురాళ్లు కాగా, జెమ్ పోర్టల్, జన్ ధన్ యోజన, ఆధార్ , డిజిటల్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరిగే లావాదేవీలు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను తీసుకొచ్చాయి.
మోదీ పాలనలో అత్యంతకీలకమైన అంశం ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్. ఇది ఆధార్‌తో మొదలైంది. దీని తర్వాత జన్ ధన్ ఖాతాల ద్వారా జనాలకు ఆర్ధిక చేయూత అందించారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో భారతదేశం వాటా 40 శాతంపెరిగింది.
పానీపూరీ విక్రేతలు, కూరగాయల విక్రేతలకు కూడా క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో తేవడం ద్వారా వారిని డిజిటల్ ప్రపంచానికి పరిచయం చేసినఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది.
Also Read: Ktr And Prashanthkishore: పీకే చెప్పిన ప్రకారమే టిక్కెట్లు..కేటీఆర్: ఆ నేతల్లో గుబులు