https://oktelugu.com/

Virata Parvam: విరాటపర్వం నుండి క్రేజీ అప్డేట్.. రానా పాడితే ఎలా ఉంటుందో చూడండి!

Virata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. పీరియాడిక్ లవ్ అండ్ రివల్యూషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విరాటపర్వం నుండి మరో అప్డేట్ సిద్ధం చేశారు. నేడు ‘ఛలో ఛలో’ లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. హీరో రానా […]

Written By:
  • Shiva
  • , Updated On : June 12, 2022 / 01:32 PM IST
    Follow us on

    Virata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. పీరియాడిక్ లవ్ అండ్ రివల్యూషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విరాటపర్వం నుండి మరో అప్డేట్ సిద్ధం చేశారు. నేడు ‘ఛలో ఛలో’ లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. హీరో రానా స్వయంగా ఈ పాట పాడారు. కెరీర్ లో మొదటిసారి రానా ఓ పూర్తి పాట పా డుతుండగా ఆసక్తి నెలకొంది.

    rana , sai pallavi

    కాగా నేడు ఆత్మీయ సమ్మేళనం పేరుతో… హన్మకొండలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రానా, సాయి పల్లవితో పాటు దర్శక నిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. విరాట పర్వం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఇద్దరు నక్సల్స్ సాయి పల్లవి, రానా పాత్రలకు స్ఫూర్తి. వారి జీవిత కథ ఆధారంగా విరాట పర్వం తెరకెక్కింది. ఈ క్రమంలో విరాట పర్వం మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: Nayanthara and Vignesh- TTD: విగ్నేష్-నయనతారలకు భారీ ఊరట… వివాదం నుండి బయటపడ్డ కొత్త జంట!

    కెరీర్ లో మొదటిసారి రానా నక్సల్ రోల్ చేస్తున్నారు. దళంలో చేరిన ప్రేమికుడి కోసం ఎదురు చూసే ప్రేమికురాలిగా సాయి పల్లవి పాత్ర ఉంటుంది. ప్రేమ కోసం, ప్రేమికుడి కోసం సాయి పల్లవి ఏం చేసిందనేది సినిమాలోని ప్రధాన సంఘర్షణ అని సమాచారం. విరాట పర్వం మూవీలో మరో హీరోయిన్ ప్రియమణి నటిస్తున్నారు. ఆమె ఈ చిత్రంలో లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. విరాట పర్వం మూవీలో ఆమె రోల్ కూడా కీలకం అని తెలుస్తుంది.

    rana sai pallavi

    కాగా జులై 1న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 17కి ప్రీఫోన్ చేశారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది. నిజానికి ఏడాది క్రితమే విరాట పర్వం మూవీ విడుదల కావాల్సి ఉంది. విరాట పర్వం మూవీతో సాయి పల్లవి మరోసారి అద్భుతమైన పాత్ర దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విరాట పర్వం చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా పాటలు ఆకట్టుకుంటున్నాయి.

    Also Read:Tadipatri Tensions: తాడిపత్రిలో వైసీపీ దౌర్జన్యకాండ.. పోలీసుల ఎదుటే దాడులు

    Tags