విద్యావ్యవస్థ ప్రక్షాళన.. తెలంగాణ సంచలన నిర్ణయాలివీ

తెలంగాణలో నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇకపై ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ గా నిర్ణయించారు. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు శ్రీకారం చుట్టారు. అటు పీహెచ్ డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ విద్యా […]

Written By: Srinivas, Updated On : July 22, 2021 1:54 pm
Follow us on

తెలంగాణలో నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇకపై ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ గా నిర్ణయించారు. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు శ్రీకారం చుట్టారు. అటు పీహెచ్ డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ విద్యా విధానం అమల్లోకి రానుంది.

జాతీయ విద్యా విధానంలో ముఖ్యాంశంగా క్లస్టర్ విద్యా విధానం అమల్లోకి రానుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేందుకు క్లస్టర్ విధానం కొనసాగుతోంది. దీని కోసం సమీపంలో ఉన్న స్కూల్స్ కాలేజీలు, గ్రౌండ్స్, లైబ్రరీ మౌలిక వసతులను వినియోగించుకుంటారు. క్లస్టర్ విధానంలో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకునే వెసులుబాటు ఉంటుంది.

క్లస్టర్స్ విధానంపై యూనివర్సిటీ వీసీలతో ఇప్పటికే చర్చించారు. ఉన్నత విద్యా మండలి అధికారులు క్లస్టర్స్ విధానంపై కమిటీ వేసింది. ఉన్నత విద్యా మండలి మూడు విధాలుగా ప్రణాళికలు రచించింది. క్లస్టర్స్ కమిటీ , యూనివర్సిటీ టు యూనివర్సిటీ అటానమస్ కాలేజీలు టు అటానమస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ టు గవర్నమెంట్ కాలేజ్ ఇలా మూడు స్థాయిలుగా క్లస్టర్ విధానం అమలు చేయనున్నట్లు కమిటీ నిర్ధారించింది.

పీహెచ్ డీ అడ్మిషన్లకు జాతీయ స్తాయిలో ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుంది. యూజీసీ స్టాండ్ ఎలోన్ యూనివర్సిటీస్ కాకుండా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ గా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త జాతీయ విద్యా విధానంపై ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్ రూపొందించారు. పార్లమెంట్ సమావేశాల తరువాత నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విదానానికి అనుగుణంగా డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది. తెలంగాణ సర్కారు జాతీయ ఆదాయంలో 6 శాతం విద్యా రంగానికి ఖర్చు పెట్టాలని ఎక్స్ పర్ట్స్ కమిటీ నిర్ణయించింది.