Education Minister Dharmendra Pradhan: తాజాగా బిహార్(Bihar)కు చెందిన ఓ విద్యార్థినికి తక్కువ మార్కులు వచ్చాయని వారి తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేని ఆర్ట్స్ కోర్సులో చేర్పించారు. నచ్చకపోయినా సదరు విద్యార్థి తల్లిదండ్రుల ఒత్తిడితో సదరు కోర్సులో చేరింది. కేవలం ఒక్క మార్కు తక్కువ వచ్చిందన్న కారణంతో తల్లిదండ్రులు తనను తనకు నచ్చని కోర్సులో చేర్పించారని, తన సోదరుల చదువు విషయంలో తల్లిదండ్రులు ఇలాంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదని ఇటీవల ఓ ఇంర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. దీంతో స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి(Central Education Ministar)ధర్మేంద్రప్రదాన్ 11వ తరగతి చదువుతున్న సదరు బాలికకు ఫోన్ చేశారు. ఇష్టమైన సైన్స్ కోర్సులో చేర్పిస్తానని భరోసా కల్పించారు.
Also Read: యూ ట్యూబర్లు హర్ష సాయి, సన్నీ యాదవ్ కు షాక్ ఇచ్చిన సజ్జనార్ సార్..
డాక్టర్ కల నెరవేరుస్తానని..
పాట్నాలోని దనాపూర్‌కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థినికి పదో తరగతిలో ఆశించిన మార్కులకన్నా ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు నచ్చిన సైన్స్ కోర్సులో కాకుండా, ఇష్టంలేని ఆర్ట్స్ కోర్సులో చేర్పించారు. దీంతో డాక్టర్ కావాలన్న తన కల నెరవేరదిన బాధపడింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్(Dharmendra Pradan) దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఖుష్బూతో మాట్లాడారు. చింతించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆమెకు సైన్స్ స్ట్రీమ్‌లో ప్రవేశం కల్పించేలా చూస్తామని, దీనికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ హామీతో ఖుష్బూ తన వైద్య వృత్తి కలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం లభించింది.
తల్లిదండ్రుల ఒత్తిడితో..
ఒక విద్యార్థికి కళలు లేదా సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వంటి ‘ప్రతిష్టాత్మక‘ కోర్సులను ఎంచుకోమని ఒత్తిడి చేయవచ్చు. దీని వల్ల విద్యార్థి చదువులో ఆసక్తి కోల్పోవడం, ఒత్తిడికి గురవడం, లేదా డిప్రెషన్‌లోకి వెళ్లడం వంటివి జరగవచ్చు. ఇటీవలి కాలంలో ఈ సమస్య గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా మందితమ అనుభవాలను పంచుకుంటూ, ఈ ఒత్తిడి వల్ల వారి జీవితంలో ఎదురైన సవాళ్లను వివరిస్తున్నారు.
సమస్య పరిష్కారానికి సూచనలు:
సంభాషణ: తల్లిదండ్రులతో ఓపికగా, స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. విద్యార్థి తన ఆసక్తులు, లక్ష్యాలను వివరించి, వాటి ద్వారా కూడా విజయం సాధించవచ్చని నచ్చజెప్పాలి.
కెరీర్ కౌన్సెలింగ్: నిష్పాక్షికమైన సలహా కోసం కెరీర్ కౌన్సెలర్‌ను సంప్రదించడం ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థి ఎంపికల గురించి విశ్వాసం కల్పించవచ్చు.
సమతుల్యత: కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు సూచించిన కోర్సును ప్రధానంగా తీసుకుని, ఇష్టమైన రంగాన్ని ద్వితీయ ఎంపికగా కొనసాగించవచ్చు.
ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి, తల్లిదండ్రులు కూడా పిల్లల సంతోషం, సామర్థ్యాలను గౌరవించే దిశగా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఇష్టం లేని కోర్సు చదివిన విద్యార్థి జీవితంలో సంతృప్తి లేక, అసంతృప్తితో గడపవలసి వస్తుంది.
Also Read: అన్వేష్ vs సన్నీ యాదవ్..సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అయినంతమాత్రాన కొమ్ములుంటాయా?