
MLC Kavitha : ఈడీ విచారణ ముగిసింది. కవితకు గొప్ప ఊరట లభించింది. కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. మొత్తానికి వారం రోజులుగా సాగుతున్న ఈ తంతుకు ప్రస్తుతానికి శుభం కార్డ్ పడి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ కథ ఇక్కడితోనే ముగియలేదు. 16న రెండోసారి ఈడీ విచారణకు మళ్లీ ఢిల్లీ రావాలని నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం కవిత తుగ్లక్ రోడ్ లోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కవితకు బీఆర్ఎస్ మహిళా దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. యుద్ధానికి వెళ్లి విజయం సాధించినంతగా కవితను ఓన్ చేసుకొని బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
కవిత ఈడీ విచారణ ముగిసిన అనంతరం తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవితను బీఆర్ఎస్ మహిళా నేతలు దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆమెను ఆలింగనం చేసుకున్నారు.
ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో వారు హైదరాబాద్ బయలు దేరుతారని సమాచారం.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. దాదాపు 8 గంటలకు పైగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ భోజన విరామ సమయం ఇచ్చారు. అనంతరం 5 గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు.
కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్ మెంట్ ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ పిళ్లైతో కలిపి కవితనపు విచారించారు. ఆధారాలు ధ్వంసం చేయడం.. డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం.. హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై ఈడీ ఆరాతీసినట్టు సమాచారం.