Rashmika Mandanna: స్టార్ క్రికెటర్ తో హీరోయిన్ రష్మిక ప్రేమాయణం..మరి విజయ్ దేవరకొండ పరిస్థితి ఏమిటి?

Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక మండన.కన్నడ లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకి ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తెలుగు లో హిట్టు మీద హిట్టు కొడుతూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ […]

Written By: Vicky, Updated On : March 11, 2023 9:15 pm
Follow us on

Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక మండన.కన్నడ లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకి ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తెలుగు లో హిట్టు మీద హిట్టు కొడుతూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది.

నేషనల్ క్రష్ గా పిలవబడే ఈమె అంటే కుర్రకారులు ఎలా పిచ్చెక్కిపోతారో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈమె పై ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శుభామ్ గిల్ మనసు పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీకు ఎవరు అంటే క్రష్ ఉంది అని యాంకర్ అడగగా , దానికి గిల్ సమాధానం ఇస్తూ రష్మిక అంటే క్రష్ ఉంది అంటాడు.

దీనితో ఇప్పుడు వీళ్ళిద్దరిని లింక్ చేస్తూ సోషల్ మీడియా లో అనేక వార్తలు వస్తున్నాయి.వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, అందుకే బాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ కూడా రష్మిక పేరు చెప్పాడంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న మాట.కానీ రష్మిక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్ గా చెప్పొచ్చు.వీళ్లిద్దరు రీసెంట్ గానే మాల్దీవ్స్ లో టూర్ కూడా వేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి కూడా.మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది, ప్రేమ లేదు అంటూ కవరింగ్ చేస్తున్నప్పటికీ ఎదో ఒక రోజు కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా లాగ పెళ్లి చేసుకొని అందరిని షాక్ కి గురి చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఎంత మాత్రం నిజం అవ్వబోతుందో చూడాలి మరి.