Bihar elections 2025: బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం సోమవారం అసలు విషయాన్ని చెప్పింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము సిద్ధంగా ఉన్నామని… ఎన్నికలు ఎప్పుడు జరుపుతామో అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు జ్ఞానేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్ 22లోపు ఎన్నికలు పూర్తవుతాయి. అసెంబ్లీ పదవీకాలం కూడా ఆరోజు ముగుస్తుంది. వాస్తవానికి చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలను అక్టోబర్ చివరి వారంలో జరిగే చాట్ పూజ నేపథ్యంలో.. ఆ పూజ అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. ఇలా కోరడం వెనక ఆసక్తికరమైన విషయం ఉంది.
చాట్ పూజ కోసం ఇతర ప్రాంతంలో స్థిరపడిన వారంతా బీహార్ వస్తారు. ఆ సమయంలో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. అయితే దీనిపై జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. “మీరు చాట్ పూజ అయితే ఎంత గొప్పగా జరుపుకుంటారో.. అదే ఉత్సాహంతో ఎన్నికలలో కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని” కోరారు. ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పత్రాలలో సీరియల్ నెంబర్లు, అభ్యర్థుల ఫోటోలు ఏర్పాటు చేస్తారు. అవి బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్ లో ఉంటాయని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఎన్నిక ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరిగా చేయాల్సిందేనని చెప్పిన జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల తర్వాత సమీక్ష చేయడం చట్టపరంగా వీలుకాదని పేర్కొన్నారు.
ఇక ఈసారి బీహార్ లో రెండు కూటమిల మధ్య ప్రధానమైన మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా నేషనల్ డెమోక్రటిక్ ఆలయన్స్ తరఫున నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. ప్రతిపక్ష మహాగట్ బంధన్ కు ఆర్జెడి నాయకత్వం వహిస్తోంది.. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 1001 సీట్లు ఉన్నాయి. వీటిలో బీజేపీకి 80 సీట్లు, జనతాదళ్ యునైటెడ్ కు 45 సీట్లు, హెచ్ ఏ ఎం పార్టీకి నాలుగు, స్వతంత్రులకు రెండు సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి 111 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆర్ జె డి కి 77, కాంగ్రెస్ పార్టీకి 19, సిపిఐ ఎంఎల్ పార్టీకి 11, సిపిఐ ఎం కు రెండు, సిపిఐ కి రెండు సీట్లు ఉన్నాయి. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏ కు 37.26% ఇండియా కూటమికి 37.23% ఓట్ల లభించాయి. చాలావరకు స్థానాలలో గెలుపు ఓటముల తేడా 2.5% మాత్రమే ఉండడం విశేషం. ఇలా ఎన్డీఏ కూటమి 21, ఇండియా కూటమి 22 సీట్లను సాధించాయి. బీహార్ రాష్ట్రంలో రెండు కూటముల మధ్య ప్రచారం జోరుగా సాగుతోంది.
LIVE | Election Commission Set To Announce Bihar Poll Dates Today, Watch NDTV’s Non-Stop Coverage#BattlegroundBihar @Ankit_Tyagi01 | @Vasudha156 | @PadmajaJoshi https://t.co/luIj3pnVZe
— NDTV (@ndtv) October 6, 2025