https://oktelugu.com/

TS MLC Elections: అసెంబ్లీలో గెలిపించుకుని.. మండలిలో కోల్పోయింది.. రెండు ఎమ్మెల్సీలూ కాంగ్రెస్‌వే!

బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌషిక్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారిస్థానాకు ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 12, 2024 / 02:10 PM IST

    TS MLC Elections

    Follow us on

    TS MLC Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇద్దరు ఎమ్మెల్సీలను నిలిపిన బీఆర్‌ఎస్‌.. ఆ ఇద్దరినీ గెలిపించుకుంది. కానీ, ఇప్పుడు మండలిలో వారి స్థానంలో మరో ఇద్దరిని నిలబెట్టుకునే అవకాశం కోల్పోయింది. కనీసం ఒక్కటయినా దక్కుతుందనుకుంటే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో రెండూ కాంగ్రెస్‌ ఖాతాలోకి చేరడం ఖాయమైంది.

    వేర్వేరుగా నోటిఫికేషన్‌..
    బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌషిక్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారిస్థానాకు ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. రెండు స్థానాలకూ గురువారం వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 29న పోలింగ్, సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.

    ఓటుహక్కు కూడా వేరుగా..
    వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తే.. ఒక్కో ఎన్నికకు ఎమ్మెల్యేలు ఒక్కోసారి ఓటు వేయాల్సి ఉంటుంది. రెండు నోటిఫికేషన్లకు రెండు వేర్వేరు ఓటు హక్కులు ఉంటాయి. అంటే ప్రతీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు 119 మంది ఓటర్లు ఉంటారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎమ్మెల్సీ అవుతారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ పార్టీకే రెండు సీట్లు లభిస్తాయి. వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని బీఆర్‌ఎస్‌ నాయకులు ఈసీకి విన్నవించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం రెండు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇక కోర్టును ఆశ్రయించినా కోర్టు కూడా జోక్యం చేసుకోలేమని బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తే పోటీ చేయకపోవడమే మేలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అదే జరిగితే రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్‌ ఖాతాలో చేరడం ఖాయం.p