AP-Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో విభిన్న పోకడలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో విభిన్న పోకడలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి.

Written By: NARESH, Updated On : January 12, 2024 3:14 pm

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం గురించి తెలుసుకుందాం.. విడిపోయి 10 ఏళ్లు అవుతోంది.. 10 ఏళ్ల వరకూ కలిసే ఉన్నాయి. అప్పుడు ఎన్నికల పోకడలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయన్నదానిపై చర్చిద్దాం..

ఉమ్మడి ఏపీలో అధికార మార్పిడి జరిగింది తప్పితే తెలంగాణ, ఏపీలో వేరు వేరు పోకడలు లేవు. ఆంధ్ర, తెలంగాణ ఒకే పార్టీకి ఓటు వేసి గెలిపించారు. వేరు వేరు పార్టీలకు వేయలేదు. రాష్ట్రమంతా ఒకే పార్టీని గెలిపించి అధికారం కట్టబెట్టేవారు.

అయితే ఈ 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందన్నది తెలుసుకుందాం.. తెలంగాణలో మారిన పరిస్థితుల్లో 2024 ఎన్నికలు ఎలా జరుగబోతున్నాయి.. అందరూ చెబుతోంది ఏంటంటే.. ఇది పార్లమెంట్ కు జరిగే ఎన్నికలు కాబట్టి కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ కు అంతగా ఓట్లు రావని అంటున్నారు.

మరి ఆంధ్రలో పరిస్థితి చూస్తే.. భిన్నంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ కు ఓకే సారి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆంధ్రాలో మూడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండబోతోంది. జగన్ పార్టీ వర్సెస్ టీడీపీ+జనసేన మధ్యన ఉండదు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ అసలు పోటీలో లేకుండా పోయాయి. ఆంధ్రా ఎన్నికల్లో జాతీయ పార్టీల పాత్ర శూన్యం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో విభిన్న పోకడలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి.