పశ్చిమ బెంగాల్ లో మనస్ రంజన్ భూటియా, అసోంలో బిస్వజిత్, తమిళనాడుల కేపీ మునుస్వామి, ఆర్ వైద్య లింగం, మధ్యప్రదేశ్ లో ధావర్ చంద్ గెహ్లాత్ రాజీనామా చేశారు. మహారాష్ర్టకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శంకర్రావ్ సతాన్ అకాల మరణం చెందారు. దీంతో ఈ ఆరు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 22. నామినేషన్ల పరిశీలనకు సెప్టెంబర్ 23 గడువు ఉంది. నామినేషన్లు డ్రా చేసుకోవడానికి ఆఖరు తీదీ సెప్టెంబర్ 27గా నిర్ణయించారు. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఇచ్చారు.
ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4నే చేపట్టనున్నారు. దీంతో పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటనకు సమాయత్తమవుతున్నాయి. ఆశావహుల నుంచి నామినేషన్లు వేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీల పరంగా ఉండడంతో అభ్యర్థుల ప్రకటనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అభ్యర్థులను ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నాయి.