https://oktelugu.com/

తెలంగాణలో భూకంపం.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాలకు భూకంప ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మరి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే మరోవైపు భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భూకంపం సంభవించింది. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. ఒక్కసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 23, 2020 / 07:03 PM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాలకు భూకంప ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మరి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే మరోవైపు భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భూకంపం సంభవించింది. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. ఒక్కసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

    కొద్దిరోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తరుచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ భూప్రకంనలు చోటు చేసుకున్నాయి. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో భూమి నాలుగుసార్లు కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

    అదేవిధంగా ఏపీలోని కృష్ణా జిల్లాలోనూ భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల కోటిలింగ క్షేత్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం భూమి నుంచి శబ్దాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానికులు వీటిని భూ ప్రకంపనలుగా భావించి ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రకంపనలు భూకంపం వల్ల వచ్చినవి కావని అధికారులు చెబుతున్నారు. భూమి నుంచి శబ్దం వస్తున్నట్లు గుర్తించారు.

    వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

    కాగా సోమవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. గుజరాత్లోనూ గత 24గంటల్లో భూమి రెండుస్లార్లు కంపించినట్లు సమాచారం. గతకొంతకాలంగా ఢిల్లీలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లోనూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనా మరోవైపు భూకంపాలతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట తిరుగలేక ఇబ్బందులు పడుతున్నారు.