అయోమయంలో క్రేజీ బయోపిక్ !

భారతీయ సినీ పరిశ్రమల్లోనే గత కోనేళ్ళుగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ‘మహానటి సావిత్రి’ బయోపిక్, ‘మహానటుడు ఎన్టీఆర్’, ‘దివంగ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి’ లాంటి సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్ లతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల బయోపిక్ లు కూడా వెండితెర మీద కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ లాంటి మేటి క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ […]

Written By: admin, Updated On : June 23, 2020 7:10 pm
Follow us on


భారతీయ సినీ పరిశ్రమల్లోనే గత కోనేళ్ళుగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ‘మహానటి సావిత్రి’ బయోపిక్, ‘మహానటుడు ఎన్టీఆర్’, ‘దివంగ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి’ లాంటి సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్ లతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల బయోపిక్ లు కూడా వెండితెర మీద కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ లాంటి మేటి క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి.

ఈ క్రమంలోనే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా వస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ బయోపిక్ ను కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ క్రేజీ బయోపిక్ ను నిర్మాత విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో కూడా ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. దాంతో పాపం ఈ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కు కాస్త ఓవర్ బడ్జెట్ అయింది. దాంతో డైరెక్ట్ గా ఒటిటిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరో పక్క అన్ని కుదిరితే ఆగష్టు లాస్ట్ వీక్ లో ఈ బయోపిక్ ను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి లెజెండరీ క్రికెటర్ బయోపిక్ అయోమయంలో పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇక ఈ బయోపిక్ ను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో ఎలా విజయం సాధించింది ? మొత్తం వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి ? ఫైనల్ గా కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అసలు కపిల్ దేవ్ జీవితం ఏమిటి ? ఆయన సాధించిన విజయాలు ఏమిటి ? ఇలా పలు ఆసక్తికరమైన విషయాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇక ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ భార్య పాత్రలో బాలీవుడ్ బ్యుటి దీపికా పదుకొనె నటిస్తోంది.