Earthquake
Earthquake: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో ఇటీవలే భూకంపం వచ్చింది. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి నష్టం జరగలేదు. మళ్లీ ప్రకంపనలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించడంతో చాలా మంది ఆందోళన చెందారు. అయితే ప్రకంపనలు లేకపోవడంతో ఇప్పుడిప్పుడే భయం తొలగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బంగాళాఖాతంలో భూకంపం వచిచంది. రిక్టర్ స్కేల్(Riktar Scale)పై 5.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిసామలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది. ఒడిశాలోని పూరీ తీరానికి సమీపంలో 91 కి.మీ లోతున ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. కోల్‌కతాలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీత్ర నమోదైంది. భూకంపం కారణంగా నష్టంపై స్పష్టత లేదు.
సోషల్ మీడియాలో పోస్టులు..
ఇదిలా ఉంటే.. భూకంపంపై చాలా మంది నెటిజన్లు, యూజర్లు భూకంపం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఎక్స్‌లో ఎర్త్ క్వేక్ హ్యాష్‌ట్యాగ్(Hashtag) ట్రెండ్ అవుతోంది. దీంతో తీవ్రత, నష్టం గురించి వివిధ ప్రాంతాలవారు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. భూకంప కేంద్రం ఒడిశాకు 175 కి.మీ దూరంలో ఉంది. అయితే నష్టంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత ప్రాంత ప్రజలకు సూచిస్తున్నారు.
మూడో జోన్‌లో కోల్‌కతా..
ఇక దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో కోల్‌కతా మూడో జోన్(Third Zone)లో ఉంది. ఇక్కడ భూకంపాలు మధ్యస్థంగా ఉంటాయి. ఈశాన్య భారతం, హిమాలయాలు లేదా గుజరాత్(Gujarath) వంటి ప్రదేశాల మాదిరిగా భూకంపాలు వచ్చే ప్రమాదం లేదు. అయినా అప్పుడప్పుడు నగరాన్ని ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతం, నేపాల్ లేదా ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాల కారణంగా ప్రకంపనలు వస్తాయి. మరోవైపు ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో భూమి స్వల్పంగా కంపించింది. మండి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంప కేంద్రం సుందర్‌నగర్ సమీపంలోని కియార్టీ వద్ద 7 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.