Homeజాతీయ వార్తలుEarthquake in Delhi: ఢిల్లీలో పెనుభూకంపం.. ఏంటీ ఉపద్రవం.. ఎందుకిలా?

Earthquake in Delhi: ఢిల్లీలో పెనుభూకంపం.. ఏంటీ ఉపద్రవం.. ఎందుకిలా?

Earthquake in Delhi: దేశంలో ప్రకృతి వైపరీత్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరభారత దేశాన్ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, అస్సోం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌. బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం భూకంపం మరింత ఆందోళనకు గురిచేసింది.

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మంగళవారం ఉదయం 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను పరుగులు పెట్టించింది. హర్యానాలోని ఝజ్జర్‌లో కేంద్రీకృతమైన ఈ భూకంపం నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్‌లోనూ కంపనాలను సృష్టించింది. ‘బెడ్‌ కదిలినట్టు అనిపించి బయటకు పరుగెత్తాం‘ అని ఓ నివాసి చెప్పగా, నష్టం లేకపోయినా ఈ సంఘటన ఢిల్లీ జనాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో ఢిల్లీలోనే భూకంపాలు ఎందుకు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Also read: ఒకప్పుడు ఆయుధాలు అంటే అమెరికా, రష్యా.. ఇకపై భారత్ మాత్రమే! ఎందుకంటే

‘సీస్మిక్‌ జోన్‌లో ఢిల్లీ..
ఢిల్లీ సీస్మిక్‌ జోన్‌– ఐVలో ఉండటం, హిమాలయాల సామీప్యం, సోహ్నా, మథురా వంటి ఫాల్ట్‌ లైన్‌లు ఈ ప్రాంతాన్ని భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భారత టెక్టానిక్‌ ప్లేట్‌ యూరాసియన్‌ ప్లేట్‌తో ఢీకొనడంతో వెలువడే ఒత్తిడి ఈ ప్రకంపనలకు కారణంగా చెబుతున్నారు. ఢిల్లీలో గత కొన్ని నెలల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు (4.0, 2.3) నమోదయ్యాయి. 2022లో హర్యానాలో 4.1 తీవ్రత భూకంపం కూడా సంభవించింది. ఈ చిన్న కంపనాలు నష్టం కలిగించకపోయినా, భవిష్యత్తులో 7–8 తీవ్రతతో పెద్ద భూకంపం సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: వడోదర గంభీర బ్రిడ్జి అందుకే కూలిందా? వెలుగులోకి షాకింగ్ నిజాలు: వైరల్ వీడియో

సన్నద్ధత ఎక్కడ?
ఢిల్లీలో 11 వేలకుపైగా జనసాంద్రత ఉంది. ఇక పాత నిర్మాణాలు, భూకంప నిరోధక భవనాల కొరత భవిష్యత్‌ ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అంచనాల ప్రకారం..8 తీవ్రత భూకంపం వస్తే 6.5% ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూకంప సన్నద్ధత కోసం ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular