Tata Motors : టాటా మోటార్స్ కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. చాలా మంది ఈ ఫీచర్ చూసే వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు టాటా తన ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో పెద్ద మార్పులు చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, కంపెనీ 2030 నాటికి 30 కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలో రూ.10లక్షలలోపు ప్రారంభ ధరతో త్వరలో విడుదల కానున్న నాలుగు కొత్త టాటా ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం. ఇవి మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తాయని అంటున్నారు.
Also Read: టాలీవుడ్ సెలబ్రిటీలపై ఈడీ కొరడా..రానా,విజయ దేవరకొండ లతో పాటు 29 మందిపై కేసు నమోదు!
కొత్త టాటా నెక్సాన్
టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్ థర్డ్ జనరేషన్ పై పనిచేస్తోంది. కొత్త డిజైన్, ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ త్వరలో వినియోగదారుల కోసం విడుదల కానుంది. నెక్సాన్ కొత్త జనరేషన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఈ ఫీచర్లు కారు సేఫ్టీ, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరుస్తాయి.
టాటా పంచ్, పంచ్ ఈవీ అప్‌డేటెడ్ మోడల్స్
టాటా తన పంచ్ లైనప్‌ను అప్‌డేట్ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్‌ను అనేకసార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఇది కొత్త డిజైన్‌ను సూచిస్తుంది. డిజైన్‌తో పాటు, కొత్త ఫీచర్లతో ఈ కారు త్వరలో మార్కెట్‌లోకి రానుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఇప్పటికే పంచ్ ఈవీలో లభిస్తున్న కొత్త ఫీచర్లను చేర్చవచ్చు.
Also Read: ‘కల్కి’ లాంటి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్..డైరెక్టర్ ఎవరంటే!
ఐసీఈ వెర్షన్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు, అప్‌డేటెడ్ మోడల్‌లో కూడా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను అందించవచ్చు. స్టాండర్డ్ పెట్రోల్‌తో పాటు, పంచ్ ఈవీ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌లో నెక్సాన్ ఈవీలోని కొన్ని కొత్త ఫీచర్లు, పెద్ద బ్యాటరీ వంటి లక్షణాలు ఉండవచ్చు.
టాటా స్కార్లెట్
టాటా ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్ సియెర్రా నుంచి తీసుకున్నారు. దీనిని స్కార్లెట్ పేరుతో విడుదల చేయవచ్చు. ఐసీఈ కర్వ్ ను తయారు చేసిన ప్లాట్‌ఫామ్ పైనే ఈ రాబోయే ఎస్‌యూవీని కూడా తయారు చేయవచ్చు. ఈ కారును పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో విడుదల చేసే అవకాశం ఉంది.