https://oktelugu.com/

రాజ‌మౌళి సినిమాకు ముందు మ‌రో ద‌ర్శ‌డితో మ‌హేష్.. ఎవరది?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ – ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో మూవీ ఫిక్స్ అయిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన తర్వాత రాజ‌మౌళి చేపట్టే ప్రాజెక్టు ఇదే. అయితే.. దానికి చాలా స‌మయం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబ‌ర్ 13న రిలీజ్ కాబోతోంది. అంటే.. ఇంకా ఎనిమిది నెల‌ల స‌మ‌యం ఉంది. ఆ త‌ర్వాత ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేయ‌డానికి, అది కంప్లీట్ కావ‌డానికి మ‌ధ్య ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలియ‌దు. Also Read: మాజీ బ్యూటీ నుండి బోల్డ్ వెబ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 28, 2021 / 10:28 AM IST
    Follow us on


    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ – ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో మూవీ ఫిక్స్ అయిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన తర్వాత రాజ‌మౌళి చేపట్టే ప్రాజెక్టు ఇదే. అయితే.. దానికి చాలా స‌మయం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబ‌ర్ 13న రిలీజ్ కాబోతోంది. అంటే.. ఇంకా ఎనిమిది నెల‌ల స‌మ‌యం ఉంది. ఆ త‌ర్వాత ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేయ‌డానికి, అది కంప్లీట్ కావ‌డానికి మ‌ధ్య ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలియ‌దు.

    Also Read: మాజీ బ్యూటీ నుండి బోల్డ్ వెబ్ సిరీస్ !

    ఇక‌, ఇప్పుడు మ‌హేష్ కండీష‌న్ చూస్తే.. ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి బరిలో నిలవబోతోంది. అంటే.. ఎంతలేదన్నా ఆగస్టు నాటికే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. అటు రాజమౌళి సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి.. ఈ మధ్యలో ఓ సినిమా లాగించాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్.

    Also Read: మహేష్ మరీ ఇంత స్లో అయితే ఎలా ?

    కొన్ని రోజులుగా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించి, ఫైనల్ గా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘సర్కారు వారి పాట’ దుబాయ్ షెడ్యూల్ ఈ మధ్యనే ఫినిష్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశాడు దర్శకుడు. మార్చిలో టీం మొత్తం గోవాలో వాలిపోనుంది. ఈ గ్యాప్ లో ఏ దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందనే డిస్కషన్లో మునిగిపోయాడు మహేష్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అయితే.. ఇప్ప‌టిక‌ప్పుడు మ‌హేష్ తో సినిమా చేయ‌డానికి అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత మ‌హేష్ తో మ‌రో సినిమా చేయాల‌ని అనుకున్నాడు వంశీ పైడిప‌ల్లి. ఓ క‌థ‌కూడా వినిపించాడు. మ‌రోవైపు.. అనిల్ రావిపూడి సైతం ప్రిన్స్ తో మ‌రో మూవీకి సిద్ధంగా ఉన్నాడు. దీంతో.. వీళ్లిద్దరిలో ఒకరితో రాజమౌళి సినిమాకు ముందు మహేష్ సినిమా తీస్తాడ‌నే విష‌యం దాదాపుగా క‌న్ఫాం అయిపోయింది. అయితే.. అనిల్ కే ఛాన్స్ ద‌క్కుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.