Early Elections In Telangana: తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళతారనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా ఇందుకు అనుగుణంగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర నిర్వహించి టీఆర్ఎస్ ను ఎండగట్టారు .ఇక రెండో దశ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
జనవరిలో పీఎం సొంత రాష్ట్రం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంలో తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో దాని కోసం సిద్దం కావాలని బీజేపీ నేతలు కూడా నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళితే కూడా రెడీ గా ఉండాలనే సంకేతాలు ఇస్తున్నారు.
Also Read: ఏపీ రాజకీయాలు శాసిస్తాం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ దృష్టి అంతా బీజేపీ పైనే ఉంది. ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ వ్యూహాలు కూడా మారనున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని బరిలో నిలిచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. నెలాఖరులో జనగామలో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రానున్నట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ సమరనాథానికి ఉత్సాహం చూపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నిలవనుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.