https://oktelugu.com/

AP New Districts: ఏపీ కొత్త జిల్లాలకు షాక్.. ఇక ఇప్పట్లో తేలవు… హైకోర్టులో అభ్యంతరాలు

AP New Districts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాల విభజనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నిస్తోంది. జిల్లాల ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని పిల్ దాఖలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2022 / 05:51 PM IST
    Follow us on

    AP New Districts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాల విభజనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నిస్తోంది. జిల్లాల ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని పిల్ దాఖలు చేశారు.

    highcourt-cm jagan

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల ఏర్పాటుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు కూడా రోడ్లెక్కి నిరసన గళం విప్పుతున్నారు. జిల్లా కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ గుంటూరు జిల్లాకు చెందిన దంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం కు చెందిన బెజ్జి సిద్ధార్థ, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు వ్యాజ్యం దాఖలు చేసిన సంతి తెలిసిందే.

    Also Read:  ‘భీమ్లా నాయక్’ 15 డేస్ కలెక్షన్స్.. పవన్ రేంజ్ ఇది

    జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారనుంది. దీంతో ఉద్యోగాల భర్తీలో సమస్యలు వచ్చే అవకాశముందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కోర్టు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. జిల్లాల ఏర్పాటులో ఏ ప్రాతిపదిక పాటించారో వివరించాలని అడగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

    highcourt-cm jagan

    ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 నిబంధనల ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించాల్సింది పోయి కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఫిబ్రవరి 26న జీవో 31 జారీ చేసినా దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో సర్కారు వైఫల్యం ఉందని తెలుస్తోంది. దీనిపై జీవో అమలును నిలుపుదల చేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Also Read:  ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్

    Tags