తెలంగాణలో అమలు చేస్తున్న స్టిక్ట్ ‘ఈ-పాస్’ నిబంధనలు ఇక ఏపీలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక కర్ఫ్యూ సహా కఠిన నిబంధనలు అమలు పరుస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు.. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవారు.. ఏపీలో తిరిగేవారికి కఠిన ప్రయాణ ప్రణాళికలు రూపొందించారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ సహా పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఏపీలోనూ ‘ఈపాస్’ అమలు చేస్తున్నారు. ఈపాస్ లేకుండా ప్రయాణించి సరిహద్దుల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచిస్తున్నారు.
*ఏపీ ‘ఈ-పాస్’ నిబంధనలివీ..
ఏపీలో ఉదయం 6-12 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఆ సమయంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికైనా తిరగవచ్చు. 12లోపు ఇంటికి చేరితే ఎవరూ ఆపరు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే మాత్రం ‘ఈపాస్’ తీసుకోవడం తప్పనిసరి
-అంబులెన్స్ లు, కర్ఫ్యూ నుంచి మినహాయింపు. అత్యవసర సేవల వాహనాలు, సిబ్బందికి మాత్రం ఎలాంటి ఈపాస్ అవసరం లేదు.
-ఏపీలో ‘ఈపాస్’ కోసం అన్ని ధ్రువపత్రాలతో వారు దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన ‘appolice.gov.in’ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు సమర్పిస్తే దరఖాస్తు దారుడికి వాట్సాప్, మెయిల్ కు నేరుగా ఈపాస్ పంపిస్తారు.
-తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడి పోలీసుల నుంచి ‘ఈపాస్ ’ తీసుకోవాలి. తెలంగాణలోని ఏ సమయంలోనే ఏపీ వాసులు వెళ్లాలంటే ‘policeportal.tspolice.gov.in’లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈపాస్ వచ్చాకే తెలంగాణలో ప్రయాణం చేయాలి.
-తమిళనాడులోకి వెళ్లాలంటే eregister.tnega.org వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.