https://oktelugu.com/

బ్లాక్‌లో శ్రీవారి ప్రసాదం.. భక్తుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారా తిరుమల ఆలయంలో ప్రసాదాల వివాదం కలకలం రేపుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ ఓ భక్తుడు రిలీజ్‌ చేసిన వీడియో సంచలనమైంది. ఆలయంలో ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయా..? అని భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. కనీసం తినే ప్రసాదాన్ని సైతం వదలడం లేదని ఫైర్‌‌ అవుతున్నారు. Also Read: షర్మిల పార్టీతో జగన్‌కు మరిన్ని విభేదాలు వచ్చినట్లేనా..? ఈనెల 21న ఓ భక్తుడు ద్వారకా తిరుమలలో చిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 / 01:14 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారా తిరుమల ఆలయంలో ప్రసాదాల వివాదం కలకలం రేపుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ ఓ భక్తుడు రిలీజ్‌ చేసిన వీడియో సంచలనమైంది. ఆలయంలో ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయా..? అని భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. కనీసం తినే ప్రసాదాన్ని సైతం వదలడం లేదని ఫైర్‌‌ అవుతున్నారు.

    Also Read: షర్మిల పార్టీతో జగన్‌కు మరిన్ని విభేదాలు వచ్చినట్లేనా..?

    ఈనెల 21న ఓ భక్తుడు ద్వారకా తిరుమలలో చిన వెంకన్నను దర్శించుకున్నాడు. మొక్కులు తీర్చుకున్న అనంతరం.. ఆలయ తూర్పు గోపురం సమీపంలో ఉన్న ప్రసాదాల కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రసాదాలు ఉన్నా ఇవ్వకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ఉన్న భక్తులు కూడా కౌంటర్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను విస్మరించి.. డబ్బు కోసం ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపించారు. ఇలాంటి వారి వల్లే హిందూయిజం నశిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయ సిబ్బందిపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    కొద్దిసేపటి తర్వాత సిబ్బంది కౌంటర్ వద్దకు వచ్చి భక్తులకు ప్రసాదం అందించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే.. ఈ వివాదంపై ఆలయ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. వీడియోలో ఆరోపణలు చేసిన భక్తుడు.. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రసాదాల కౌంటర్లోకి వచ్చారని.. పులిహోర, చక్కెర పొంగలి అడిగిరాని తెలిపారు. అప్పటికే జారీ చేసిన టోకెన్ల వరకే ప్రసాదం ఉందని వివరించారు. కొత్తగా తయారు చేసిన ప్రసాదం వచ్చేలోగానే భక్తులు వివాదం చేసినట్లు తెలిపారు.

    Also Read: తిరుపతి, సాగర్‌‌ ఎన్నికలకు మార్చి 7న షెడ్యూల్‌..!

    పైగా పులిహోర, చక్కెర పొంగలి మధ్యాహ్నం 3 గంటల వరకే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయన్నారు. పులిహోర, చక్కెర పొంగలి త్వరగా చెడిపోయే అవకాశమున్నందున పరిమితంగానే తయారవుతుందని.. భక్తుల రద్దీని బట్టి మళ్లీ తయారు చేస్తారని తెలిపారు. భక్తుల కోసం నిత్యం 10 వేల లడ్డూలు అందుబాటులో ఉంటాయని ప్రసాదం కొరత వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆలయంలో బ్లాక్ లో ప్రసాదం విక్రయిస్తున్నట్లు భక్తులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఇప్పటికే విజయవాడ ఆలయంలో వివాదం మరువకముందే మినీ తిరుమలలో ఈ వివాదం చోటుచేసుకోవడం చర్చకు దారితీసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్