చౌక వడ్డీకే రుణాలు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలోని ఉద్యోగులకు, వ్యాపారులకు ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడంతో ఎక్కువమంది రుణాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇతర లోన్ లతో పోలిస్తే వడ్డీ ఎక్కువైనా చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పర్సనల్ లోన్ తీసుకోవాలని యోచించే వారికి ఇతర బ్యాంకులతో పోలిస్తే పది బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. Also Read: వాహనదారులకు అలర్ట్.. వారికి వాహనం ఇస్తే జైలుకే..? డబ్బు అవసరమై ఏ బ్యాంక్ నుంచి […]

Written By: Navya, Updated On : February 23, 2021 1:52 pm
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలోని ఉద్యోగులకు, వ్యాపారులకు ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడంతో ఎక్కువమంది రుణాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇతర లోన్ లతో పోలిస్తే వడ్డీ ఎక్కువైనా చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పర్సనల్ లోన్ తీసుకోవాలని యోచించే వారికి ఇతర బ్యాంకులతో పోలిస్తే పది బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.

Also Read: వాహనదారులకు అలర్ట్.. వారికి వాహనం ఇస్తే జైలుకే..?

డబ్బు అవసరమై ఏ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకొవాలని అనుకున్నా వడ్డీ రేట్లను మొదట తెలుసుకోవాలి. పర్సనల్ లోన్ తీసుకునే వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీక్లోజర్ చార్జీలపై కూడా అవగాహన పెంచుకోవాలి. అన్ని విషయాల గురించి తెలుసుకున్న తరువాత మాత్రమే రుణం తీసుకోవాలి. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో పోలిస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే రుణాలను ఇచ్చే బ్యాంకులలో ముందువరసలో ఉంది.

Also Read: రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో రేషన్ ఏటీఎంలు..?

8.9 శాతం నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ ప్రారంభమవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.95 శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ బ్యాంకుల తర్వాత 9.05 శాతం వడ్డీరేటుతో ఇండియన్ బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర 9.55 శాతం వడ్డీతో రుణాలను మంజూరు చేస్తుండగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.6 శాతం వడ్డీరేటుతో రుణాలను మంజూరు చేస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులలో రుణం తీసుకోవాలంటే 10 శాతం కంటే ఎక్కువ మొత్తం వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ లను సంప్రదించడం ద్వారా పర్సనల్ లోన్ ఛార్జీలకు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.