Homeజాతీయ వార్తలుDurex India: ఆన్ లైన్ లో డ్యూరెక్స్ కండోమ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఐతే మీరు ప్రమాదంలో...

Durex India: ఆన్ లైన్ లో డ్యూరెక్స్ కండోమ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఐతే మీరు ప్రమాదంలో పడినట్టే..

Durex India: ఆధునిక కాలంలో పెళ్లికాకముందే తొందర పడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఓయో రూములలో స్వర్గసుఖాలను అనుభవించేవారు పెరిగిపోయారు. నచ్చితే తనివితీరా కలుసుకోవడం.. నచ్చకపోతే దూరం జరిగిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక ఆధునిక జంటలు కూడా పెళ్లి అవ్వగానే పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. కెరియర్, ఉద్యోగం, డబ్బు, సామాజిక హోదా.. ఇవన్నీ లెక్కలేసుకుంటున్నారు. అవి లక్ష్యాలుగా ఉన్నప్పటికీ.. పడక సుఖాన్ని వదులుకోలేరు కదా. అందుకే అలాంటి సమయంలో “జాగ్రత్తలు” పాటిస్తున్నారు. అలా జాగ్రత్తలు పాటించే క్రమంలో.. కండోమ్ లు వాడుతున్నారు. బయట మెడికల్ షాప్ లో కొనుగోలు చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి.. ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేస్తున్నారు.. మరి కొంతమంది ఇతర సంబంధాల నేపథ్యంలో.. ఆన్ లైన్ లో కండోమ్ లు ఆర్డర్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వాటిని కొనుగోలు చేసేవారి వివరాలు ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం స్వర జీత్ మజుందార్ అనే వ్యక్తి పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

జాగ్రత్త తీసుకోవడం లేదు

మనదేశంలో కండోమ్స్ ను రకరకాల కంపెనీలు విక్రయిస్తాయి. అయితే ఇందులో డ్యూరెక్స్ కంపెనీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దీని మాతృ సంస్థ బ్రిటిష్ దేశానికి చెందిన రెకిట్. ఇది డ్యూరెక్స్ ఇండియా పేరుతో మనదేశంలో కండోమ్స్ విక్రయిస్తూ ఉంటుంది. రకరకాల ఫ్లేవర్లలో.. ఇతర ఉత్పత్తులను కూడా అమ్ముతూ ఉంటుంది.. గతంలో ఆఫ్ లైన్ లో మాత్రమే తన ఉత్పత్తులను విక్రయించేది. కానీ కొంతకాలంగా ఆన్ లైన్ లోనూ విక్రయాలు చేపడుతోంది. యువకులు, యువతులు ఎక్కువగా ఆన్ లైన్ లో డ్యూరెక్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.. అయితే ఇలాంటి సమయంలో ఆన్ లైన్ లో కొనుగోలు చేసేవారి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన డ్యూరెక్స్.. ఏమాత్రం భద్రత పాటించకపోవడంతో ఆ సమాచారం ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రస్తుత కాలంలో ఎంతటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా మనదేశంలో నేటికీ కండోమ్ లు బహిరంగంగా కొనుగోలు చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ కండోమ్స్ కొనుగోలు చేసిన వారు ఎలాంటి అవసరాల నిమిత్తం ఆ పని చేశారో తెలియదు. ఒకవేళ ఆ సమాచారం ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. ఇక చెప్పడానికి ఏముండదు. అసలే నేటి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. వారి వద్ద ఉన్న కస్టమర్ల సమాచారంతో ఏదైనా చేయగలరు.

ప్రమాదంలో పడ్డట్టే..

వాస్తవానికి ఏ కంపెనీ అయినా ఆన్లైన్ లో ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పుడు.. కస్టమర్ల సమాచారాన్ని బయటకి తెలియకుండా చూడాలి. తన వెబ్ సైట్ లో పటిష్టమైన ఫైర్ వాల్స్ వాడాలి. అంతకుమించి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ డ్యూరెక్స్ ఇండియా ఈ పని చేయడం లేదని స్వరజిత్ మజుందార్ చెబుతున్నాడు. ” మన దేశం పూర్తి సాంప్రదాయమైనది. నేటికీ కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడుకోవడం కుదరదు. అలాంటప్పుడు చాలామంది కొన్ని వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేస్తుంటారు. అలాంటి సమయంలో వారి సమాచారాన్ని భద్రంగా ఉంచకుండా ఇలా బయటపెట్టేందుకు కారణమైతే ఆ కంపెనీ విఫలమైనట్టే కదా.. డ్యూరెక్స్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరిందని” స్వరజీత్ మజుందార్ పేర్కొన్నాడు. కాగా ఈ విషయం మీడియాలో సంచలనం కావడంతో డ్యూరెక్స్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనుగోళ్లు చేసేవారు ఆందోళన చెందుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular