అగ్రరాజ్యం అమెరికాలో కొద్దిరోజులుగా ఎన్నికల సందడి మొదలైంది. కరోనా టైంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయకుండా అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. నాలుగేళ్లకొసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరుగనున్నాయి. ప్రతీసారి లాగానే ఈసారి కూడా నవంబరు తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం(నవంబరు 8)లో ఎన్నికలు జరుగనున్నాయి.ప్రస్తుతం 58వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నాడు. ఇక డెమొక్రటిక్ పార్టీ తరుపున జో బిడైన్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అగ్రరాజ్యం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు పార్టీలే ఎందుకు విన్పిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
భారత్ లో వందల సంఖ్యలో పార్టీలున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. అయితే అమెరికాలో కేవలం రెండు పార్టీలే శతాబ్దాలుగా అక్కడి ప్రజలను పాలిస్తున్నాయి. 1845 నుంచీ ఇదే తంతు నడుస్తోంది. దీంతో అమెరికాలో ఈ రెండు పార్టీలే ఉన్నాయా? మరే పార్టీలు లేవా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ రెండు పార్టీలతోపాటు దాదాపు 30 రాజకీయ పార్టీలు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: అమెరికాలో సామాజికకోణం ఫలితాన్ని నిర్ణయించబోతుందా?
ఈ పార్టీలు అధ్యక్ష ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని తెలుసుకోనేందుకు ప్రతీఒక్కరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం డబ్బు ప్రభావమేనని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తి ఓసారి నామినేషన్ వేశాక దేశం మొత్తం తిరిగి రావాల్సి ఉంటుందట.
ఇందుకోసం వందల కోట్ల డబ్బు ఖర్చువుతుందని తెలుస్తోంది. దీంతోనే చిన్న చితక పార్టీలు అంత మొత్తం ఖర్చు పెట్టలేక పోటీ చేయడం లేదు. అంతేకాకుండా ఎన్నికల్లో ప్రచారం ఆయా పార్టీలు పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు సేకరిస్తాయి. అయితే వాళ్లంతా చిన్నచితక పార్టీలకు కాకుండా గెలిచే పార్టీలు ఇస్తారు. దీంతో ఆ పార్టీలన్నీ ఎన్నికల బరిలో నిలిచే సాహసం చేయడం లేదు.
Also Read: అమెరికా ఎన్నికలు: పెద్దన్న కాబోయేది ఎవరో..?
1992, 1996లో రాస్ పెరోట్ సారథ్యంలోని రిఫార్మ్ పార్టీ సాహసం చేసి బరిలో నిలిచింది. అయితే ఒక్క ఎలక్ట్రోరల్ ఓటు కూడా దక్కకపోవడంతో వెనక్కి తగ్గింది. డబ్బు ప్రభావం కారణంగా అమెరికాలో ఇతర పార్టీలు పోటీ చేయకపోవడంతో శతాబ్దాలుగా డెమొక్రాటిక్.. రిపబ్లిక్ పార్టీలే అమెరికా పౌరులను శాసిస్తున్నాయి.