దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు దుబ్బాకలో తిష్ఠవేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రతిపక్షాలు బల్లగుద్ది చెబుతుండటంతో ఈ ఉప ఎన్నికలో గెలుపు ఎవరి వైపు అనే చర్చ జోరుగా నడుస్తోంది.
Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు కలిసి వస్తాయని అధిష్టానం భావిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోని ఉన్న సమయంలోనే రామలింగారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీంతో రామలింగారెడ్డి కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు దుబ్బాక ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్నారు. దుబ్బాకను అన్నివిధాలా హామీ చేస్తానంటూ హరీష్ రావు హామీ ఇస్తున్నారు. దుబ్బాక పౌరులంతా తనను చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. దుబ్బాకను మరో సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తానంటూ హరీష్ రావు ప్రజలకు హామీ ఇస్తున్నారు. దీంతో ప్రజలంతా అయోమయంలో పడిపోతున్నారు.
ఈ క్రమంలోనే దుబ్బాక ప్రజలు పలు డిమాండ్లకు తెరపైకి తీసుకొస్తున్నారు. దుబ్బాకను రెవిన్యూ డివిజన్ చేయాలని.. టైక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో కేసీఆర్ దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రి కడుతానని హామీ ఇచ్చారని దానిని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్.. హరీష్ రావులు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని దుబ్బాక ప్రజలు కోరుతున్నారు.
Also Read: తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి
ప్రతిపక్షాలు సైతం టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నో హామీలను ఇచ్చిందని.. ఇప్పటివరకు ఒకటి నెరవేర్చలేని ప్రజలకు వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ప్రశ్నించడానికి కూడా నోరెత్తనివ్వరని హెచ్చరిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్రజలు మాత్రం అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుందా? లేదా ప్రతిపక్షాలు సత్తా చాటుతాయా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!